చేపకళ్ల ప్రణీత కెరీర్ ఓవర్ నైట్ ఛేంజ్ అయ్యింది. అసలు ఏ అవకాశాలు లేని ఈ అమ్మడికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లిఫ్టిచ్చాడు. అత్తారింటికి దారేది సినిమాలో సంతతతో పాటే సెకండ్లీడ్ గా ఛాన్సిచ్చాడు. ఆ ఒక్క లిఫ్టింగు తో అరడజను పైగా నే అవకాశాలొచ్చాయి. వరుసగా స్టార్ హీరోలతో ఛాన్సులొచ్చాయి. అయితే అదే సీన్ ఇప్పుడు లక్కీ లక్కీ రాయ్.. రాయ్ లక్ష్మీ(రాయ్) విషయంలోనూ రిపీటవుతుందా? అంటే ఏమో .. ఏం జరగడానికైనా ఛాన్సుందనే అంటున్నారు.
లక్ష్మీ రాయ్ చివరిసారిగా రవితేజ సినిమా బలుపులో ఓ చిన్న క్యారెక్టర్, ఐటెమ్ నంబర్ లో కనిపించింది. లక్కీ లక్కీ రాయ్ అంటూ కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆ సినిమాతో. ఆ తర్వాత చంద్రకళ సినిమాలో నటించినా అది డబ్బింగ్ సినిమా మాత్రమే. ఇప్పుడు మళ్లీ సర్ధార్ గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ లో పునప్రవేశం చేస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ఛాన్సిచ్చారు. ఓ ఐటెమ్ నంబర్ తో పాటు కొన్ని సన్నివేశాల్లోనూ రాయ్ లక్ష్మీ కనిపించబోతోంది. కేవలం ఐటెమ్ నంబరే కాదు, కొన్ని సీన్స్ లోనూ నటించే ఛాన్సిచ్చారు పవర్ స్టార్.
చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. . అంటూ ఉబ్బి తబ్బిబ్బవుతోంది అమ్మడు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలకు నా కనెక్టివిటీ ఉంటుందని లక్ష్మీ చెప్పింది. అప్పట్లో ధోనీతో ప్రేమాయణంలో, ఆ తర్వాత బలుపు ఐటెమ్ తో పేరొచ్చింది. ఇప్పుడు పవన్ ఛాన్సివ్వడం వల్ల క్రేజొచ్చింది. ఈ క్రేజును నిలబెట్టుకుని ప్రణీత లానే లక్కీరాయ్ కూడా ఎదుగుతుందేమో చూడాలి.