ఫోటో స్టోరీ: మూడు బికినీ బాంబులు

Update: 2019-11-27 08:47 GMT
అదేదో యాడ్ లో 'లడ్డూ కావాలా నాయనా'..  'ఇంకో లడ్డూ కావాలా నాయనా' అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి పరిస్థితి.  తంతే బూరెల బుట్టలో పడ్డాడు అంటారు కదా.. నెటిజన్ల పరిస్థితి ఒక్కోసారి అంతే.  రాయ్ లక్ష్మి ఒక హాటు సుందరి.  షమ సికిందర్ మరో ఘాటు వయ్యారి.  ఈ సుందరి.. ఆ వయ్యారి ఇద్దరూ కలిసి బికినీలు ధరించి దుబాయిలో నిక్కీ బీచ్ లో వేడిని పెంచుతూ ఉన్నారు.

ఈ సంగతిని ఆ భామలే వెల్లడించారు. షమ తన ఇన్స్టా ఖాతా ద్వారా బీచ్ వెకేషన్ ఫోటోలు పోస్ట్ చేసి "ఇష్టమైన వ్యక్తులతో గడిపే రోజు ఎంతో అందమైనది కదా!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దుబాయిలోని నిక్కీ బీచ్ లో ఈ ఫోటోను తీయించుకున్నామని ఆమె వెల్లడించింది. ఈ ఫోటోలో షమ సికిందర్ బ్లాక్ బికినీలో అందాలను వడ్డించగా.. రాయ్ లక్ష్మి బ్లాక్ - రెడ్ బికినీ లో వయ్యారాన్ని ఒలకబోసింది.  ఈ ఇద్దరు కాకుండా మరో బికినీ భామ కూడా తోడైంది. అమెవరో తెలియదు కానీ ఈ బికినీ అందాలను చూసి నెటిజన్లు థ్రిల్లయ్యారు.  ఎదేతేనేం.. అందరూ కలిసి దుబాయిలో  బికినీ ఫెస్టివల్ జరుపుకున్నారు.

ఈ ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు వచ్చాయి.  "మూడు బికినీ బాంబులు".. "నిక్కీ బీచిలో లక్కీ బాయ్".. "త్రీ హాట్ లేడీస్" అంటూ స్పందించారు.  సినిమాల విషయానికి వస్తే రాయ్  లక్ష్మి 'ఝాన్సి' అనే కన్నడ సినిమాలోనూ.. తమిళంలో 'సిండ్రెల్లా'.. 'మిరుగా' అనే సినిమాల్లో నటిస్తోంది.  షమ సికందర్ చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు.
Tags:    

Similar News