మంచు మోహన్ బాబు కూతురు, యాక్టర్, విలన్, టెలివిజన్ కార్యక్రమాల హోస్ట్, సోషల్ యాక్టివిస్ట్.. ఇలా అనేక రోల్స్ పోషించేస్తున్న మంచు లక్ష్మి.. ఇప్పుడు మేము సైతం అనే టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న పద్ధతిలో ఈ టెలివిజన్ షో ఉండనుంది. సెలబ్రిటీలను సామాన్యులుగా మార్చేసి, నిధులు సమీకరించి, పేదలకు సాయం చేసే వినూత్నమైన కాన్సెప్ట్ మేము సైతం.
ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పంజాబీ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మింది, భల్లాలదేవుడు రాణా కూలీ అవతారం ఎత్తాడు, అక్కినేని వారసుడు అఖిల్ ఆటో నడిపాడు. అయితే.. ఈ మేము సైతం కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చిన మరో కార్యక్రమం ఉంది. ఆ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగానే చెప్పింది. హిందీలో ప్రసారమైన 'మిషన్ సప్నే' కార్యక్రమం ఆధారంగా మేము సైతం ప్రోగ్రాంని డిజైన్ చేసినట్లు చెప్పింది మంచు వారసురాలు. మిషన్ సప్నేలో సల్మాన్ ఖాన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లు పాల్గొనడంతో.. ఆ కార్యక్రమం భారీ సక్సెస్ ను సాధించింది కూడా.
ఇప్పటికే సెట్స్ లోనూ మేము సైతం కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా.. మొత్తం 26 డాక్యుమెంటరరీలను ప్రసారం చేయనున్నారు. 6 నెలల పాటు నిరంతరాయంగా మేము సైతం టెలికాస్ట్ కానుంది. మీ అందరి ప్రేమ కావాలంటూ మంచు లక్ష్మి ట్విట్టర్ సాక్షిగా అభిమానులను కోరుకుంది.