గ్లామర్ డోస్ పెంచిన రత్తాలు!

Update: 2021-02-27 02:30 GMT
దక్షిణాది వయ్యారి లక్ష్మీరాయ్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ వయ్యారి కేవలం తెలుగే కాదు అటు తమిళ, హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. కానీ గత రెండేళ్లుగా లక్ష్మి.. సినిమాల హవా బాగా నెమ్మదించింది. మరి ఆమెనే కావాలని స్లో అయ్యిందా లేక అవకాశాలు రావట్లేదా అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ రాయ్ బ్యూటీ ఎల్లప్పుడూ యాక్టీవ్ పర్సనే. అందుకే తాజాగా అమ్మడి లేటెస్ట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ మధ్య సినిమాలలో అడపాదడపా కనిపించినా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా దర్శనమిస్తోంది. లక్ష్మిరాయ్ అనే పేరు కలిసి రావడం లేదని ఆ మధ్యలో పేరు కూడా రాయ్ లక్ష్మిగా మార్చుకుంది అమ్మడు.

అయితే లక్ష్మి క్రమం తప్పకుండా గ్లామర్ ప్రియులకోసం తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట పంచుకుంటుంది. తాజాగా లక్ష్మి ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వయ్యారి అల్ట్రా స్టైలిష్ లుక్కులో కనిపిస్తోంది. అలా లాంగ్ హెయిర్ గాల్లో ఎగరేస్తూ అందమైన కళ్లతో ఆకర్షిస్తోంది. ఈ పోజుతో అమ్మడు కళ్లతో మురిపించగలనని గుర్తుచేస్తోంది. అయితే ఈ భామ కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం బయట పెద్దగా తెలియదు. ఈ గ్లామర్ బ్యూటీ సారీ టు బికినీ ఇలా సినిమాకి అవసరం అయితే ఎలాంటి సీన్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటోంది. ఆ మధ్య జూలీ-2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకోసం ఏకంగా బికినీ ధరించి ఘాటైన ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది కానీ ఆ సినిమా ప్లాప్. అప్పటినుండి మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్ళలేదు. ప్రస్తుతం సౌత్ లోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో పలకరిస్తుందేమో!
Tags:    

Similar News