ఆస్కార్ వేటలో మన 'ఛెలో షో' మరో అడుగు ముందుకు

Update: 2022-12-22 07:00 GMT
ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ఛెలో షో ను ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా దేశం నుండి అధికారికంగా పంపించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఆస్కార్‌ అవార్డు వేటలో మరో అడుగు ముందుకు వేసింది. ఆస్కార్‌ అకాడమీ వారు విడుదల చేసిన షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది.

అకాడమీ షార్ట్‌ లిస్ట్‌ లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ గా షార్ట్‌ లిస్ట్‌ లో చోటు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఛెలో షో కూడా ఎంట్రీ దక్కించుకోవడం జరిగింది.

పాన్‌ నిలన్ దర్శకత్వంలో రూపొందిన ఛెలో షో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో ఆస్కార్‌ నామినేషన్స్ దక్కించుకుంటుందనే బలమైన విశ్వాసంతో మేక్స్ ఉన్నారు.

జనవరి 24, 2023 నుండి నామినేషన్స్ ను అధికారికంగా ప్రకటించనున్న అకాడమీ షార్ట్‌ లిస్ట్‌ ను విడుదల చేయడం ఆశావాహుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌ కేటగిరీలో 15 సినిమాల తో షార్ట్‌ లిస్ట్‌ ను విడుదల చేసిన ఆస్కార్‌ అకాడమి అందులో మన గుజరాతీ సినిమా ఛెలో షో కు ఛాన్స్ ఇవ్వడంతో ఇండియన్ సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాటు నాటు పాట తో పాటు ఛెలో షో కు షార్ట్‌ లిస్ట్‌ లో చోటు దక్కడంతో కచ్చితంగా ఆస్కార్‌ నామినేషన్స్ లో కూడా చోటు దక్కించుకుంటాయి అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News