95 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే 95 రూపాయ‌ల‌కే సినిమా!

Update: 2022-10-11 12:30 GMT
95వ‌ ఆస్కార్ అవార్డుల‌కు ఇండియాని నుంచి గుజ‌రాతీ చిత్రం 'చెల్లో షో' నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. 1200 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' ని ప‌క్క‌కు నెట్టి మ‌రీ ఈ సినిమా ఇండియా నుంచి  నామినేట్ అయింది. ఉత్తమ విదేశీ  చిత్రాల విభాగంలో ఆస్కార్ బ‌రిలో నిలిచింది.  ఈ నేప‌థ్యంలో  ఇదే చిత్రాన్ని అక్టోబ‌ర్ 13  లాస్ట్ ఫిల్మ్ షో గా  ఇంగ్లీష్ లో విడుద‌ల‌వుతుంది.

ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి చిత్రాన్ని చూపించాల‌న్న ఉద్దేశంతో ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 95 థియేట‌ర్ల‌లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా సింబాలిక్ గా ఈ సినిమా టిక్కెట్ ధ‌ర‌ని కూడా 95 రూపాయ‌లుగానే నిర్ధారించారు. 95వ ఆస్కార్ అవార్డులు...95 థియేట‌ర్లు..95 రూపాయ‌ల టిక్కెట్ ధ‌ర అన్ని సింబాలిక్ గా అలా కుదిరాయి.

అందుకే ప్ర‌త్యేకంగా 95 థియేట‌ర్ల‌లో సినిమాని రిలీజ్ చేసి త‌మ సినిమాలో అస‌లు విష‌యం ఏంటి? అన్న‌ది ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేసే మ‌రో ప్ర‌య‌త్నం. సినిమాలంటే తీవ్రంగా అభిమానించే ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి క‌థ నేప‌థ్యంలో సాగుతుంది. తొమ్మిదేళ్ల వ‌య‌సులో ఆ కుర్రాడి ఆలోచ‌న‌లు సినిమాల ప‌ట్ల ఎలా ఉండేవి?  సినిమాలు చూసి ఎలా ఇన్ స్పైర్ అయ్యాడు?  సినిమా అత‌నిలో తీసుకొచ్చిన మార్పులు వంటి అంశాల‌తో  మ‌లిచిన‌ట్లు  తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు న‌ళిన్ త‌న స్వీయా అనుభ‌వాల ఆధారంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. రాయ్ క‌పూర్ పిల్మ్స్-జుగాడ్ మోష‌న్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సిద్దార్ధ్ క‌పూర్-ధీర మోమయ నిర్మాత‌లు. ఈ సినిమా అస్కార్ తెస్తుంద‌ని అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇటీవ‌లి కాలంలో ఇండియ‌న్ సినిమాలు విదేశాల్లోనూ స‌త్తా చాటుతున్నాయి.

అంత‌ర్జాతీయ ఫిలిం సెట్స్ వ‌ల్స్ లో నూ ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్నాయి. సినిమా చూసే విధానంలో ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల్లోనూ మార్పులొస్తున్నాయి. అవార్డ్ విన్నింగ్ సినిమాల‌కు ఆద‌ర‌ణ ద‌క్కుతోంంది.

కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు పెద్ద పీట వేస్తున్నారు. అలాగే జ‌న‌ర‌ల్ క్యాట‌గిరి విభాగంలో 'ఆర్ ఆర్ ఆర్' కూడా ఆస్కార్ బ‌రిలోకి దిగిన సంగ‌తి  తెలిసిందే. జ్యూరీ తిర‌స్క‌రించినా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప‌ట్టుబట్టి మ‌రి ఆస్కార్ కి వెళ్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News