రజనీకాంత్ హెల్త్ పై తాజా బులెటిన్ విడుదల .. !

Update: 2021-10-29 11:31 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో నిన్న చేరారని, తల తిరుగుతుండడంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని ఆ బులెటిన్ లో వెల్లడించారు. రజనీకాంత్ ను నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. మరికొన్నిరోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆ బులెటిన్ లో వెల్లడించారు. ప్రస్తుతం రజినీకాంత్‌కు 72ఏళ్లు. ఓ వైపు వయసు మీద పడడం.. మరోవైపు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో షూటింగ్‌ లు కూడా తగ్గించుకున్నారు. ఇక పార్టీ పేరు ప్రకటించి కూడా వెనక్కి తగ్గారు. దీని వెనుక కూడా అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది. రజినీ లెటెస్ట్ మూవీ అన్నాత్తే,. తెలుగులో పెద్దన్నగా వస్తోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

తాజాగా రజినీకాంత్ తన భార్య, కుమార్తెలు తదితర కుటుంబ సభ్యులతో కలిసి ‘అన్నాత్తే’ సినిమా చూశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కుష్బు, మీనా, సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు. నవంబర్‌ 4న రిలీజ్ కానుంది. పల్లెటూరోడ్ని శాంతంగానే చూసి ఉంటావ్.. కోప్పడితే చూడలేదు కదా.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు' అనే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలిపింది. టీజర్ చివర్లో రజనీకాంత్ నడుచుకుంటూ వస్తుంటే.. పక్కన లారీలు గాల్లోకి ఎగిరే షాట్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ కి సినిమా ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. 2021, జూన్‌ 19న ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లారు రజినీకాంత్. సాధారణ వైద్య పరీక్షల కోసమేనని ప్రకటన విడుదల చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో రజినీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. అప్పటినుంచి ప్రతి ఏడాది చెకప్‌ కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నారు.



Tags:    

Similar News