రాశీ ఖన్నా.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన `మనం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన `ఊహలు గుసగుసలాడే`తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ మూవీలో రాశీ ఖన్నా అందం, అభినయం మరియు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే వరుస అవకాశాలు అందుకున్న ఆమె.. సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే చిత్రాలతో విజయాలను అందుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా.. ఈ మధ్య ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి నాజూగ్గా మారింది. అయితే బొద్దుగా ఉన్న రోజుల్లో ఆమెను ఎందరో అవమానించే వారట. ఈ విషయాన్ని రాశీ స్వయంగా తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అజయ్ దేవ్‌గణ్, రాశీ ఖన్నా జంటగా నటించిన `రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్` వెబ్ సిరీస్ ఇటీవలె రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకుంది. అలాగే కెరీర్ తొలినాళ్లలో తాను పడిన కొన్ని ఇబ్బందులను అందరితోనూ పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. `నా సినిమా కెరీర్ పూలపాన్పేమీ కాదు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవమానాలు, మరెన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో మంది బాడీ షేమింగ్ చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండడం వల్ల కొంతమంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని వెక్కిరించారు. నేను అలా కనిపించడానికి నా ఆరోగ్య సమస్యలే కారణం. పీసీఓడీ అనే సమస్య నన్ను ఇబ్బంది పెట్టింది.
ఈ విషయం ఎవరికీ తెలియదు. అందుకే నన్ను గ్యాస్ ట్యాంకర్ తో పోల్చుతూ కామెంట్లు చేశారు. ఆ కామెంట్స్ నన్ను ఎంతగానో బాధపెట్టాయి. అయినా ఎవరో అన్నారని కాదు.. కోరుకున్న రంగంలో సక్సెస్ అయ్యేందుకు, ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లి చక్కటి శరీరాకృతి, ఫిట్‌నెస్ సాధించాను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. రాశీ ఖన్నా తెలుగులో నాగ చైతన్య సరసన `థాంక్యూ`, గోపీచంద్‌కు జోడీగా `పక్కా కమర్షియల్` చేసింది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే తమిళంలో నాలుగైదు కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసిన రాశీ ఖన్నా.. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో `యోధ`, రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.