ఆర్ఆర్ఆర్‌ చూశాను.. రూ.3000 కోట్ల వసూళ్లు ఖాయం

Update: 2022-03-17 12:30 GMT
బాహుబలి 2 సినిమా రెండు వేల కోట్ల వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో మళ్లీ ఆ స్థాయి వసూళ్లు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం అవ్వదేమో అని అంతా భావిస్తున్నారు. ఒక వేళ ఆ రికార్డును బ్రేక్ చేస్తే కేవలం రాజమౌళి మాత్రమే బ్రేక్ చేయగలడు అని చాలా మంది చెబుతూ వస్తున్నారు. అంతా భావిస్తున్నట్లుగానే బాహుబలి 2 రికార్డును రాజమౌళి తన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో బ్రేక్‌ చేయబోతున్నట్లుగా కలరిస్ట్‌ శివ కుమార్‌ నమ్మకంగా చెబుతున్నాడు.

కేవలం బాహుబలి 2 చిత్రం యొక్క రెండు వేల కోట్ల వసూళ్లను బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమా ఏకంగా మూడు వేల కోట్ల వసూళ్లను సాధించి హాలీవుడ్‌ సినిమాల రేంజ్ లో నిలువబోతున్నట్లుగా ఆయన చెబుతున్నాడు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా మలయాళ వర్షన్‌ ను చూశానంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో సినిమాల ఫైనల్‌ ఔట్‌ పుట్‌ ను కలరిస్ట్‌ అయిన శివ కుమార్ కు చూసే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ను కూడా ప్రపంచం కంటే ముందు ఆయనకే చూసే అవకాశం దక్కింది.

మూడు ఏళ్లుగా జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ను ఆయన చూశాడు. ఆయన కలరిస్ట్‌ గా ఈ సినిమా కు వ్యవహరించాడట. ఆయన గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కలరిస్ట్‌ అనేది జాబ్ గురించి చాలా మంది ఇప్పుడే వింటున్నారు. ఆయన ఏం చేస్తారా అనే విషయం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.. కాని ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తుతం దేశం మొత్తం సినీ ప్రేమికులు ఊగిపోతున్నారు.

నేను ఆర్ ఆర్‌ ఆర్‌ ను చూశాను. నేను ఒక్కో ఫ్రేమ్‌ ను వెయ్యి సార్లు ఒక కలరిస్ట్‌ గా చూసే అవకాశం దక్కింది. నాకు ఈ సినిమా ను మొదట చూసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.. ఈ సమయంలో నేను ఎమోషనల్ అవ్వకుండా ఉండలేక పోతున్నాను. నేను నమ్మకంగా చెబుతున్నాను ఇది ఒక రికార్డు బ్రేకింగ్‌ మూవీ. మూడు వేల కోట్ల వసూళ్లు ఈ సినిమాకు సాధ్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆయన వ్యాఖ్యలకు ముందు నుండే సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆయన ఆ అంచనాలను మరింతగా పెంచాయి. కనుక ఈ సినిమా రికార్డు ను బ్రేక్‌ చేయడం ఖాయం అనిపిస్తుంది. అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాజమౌళి తీసుకు రాబోతున్నాడు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమాను సాధిస్తే జక్కన్న ది గ్రేట్‌ అంటూ బాలీవుడ్‌ చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే అంటూ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News