చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని.. డాక్టర్ అయ్యాక యాక్టర్ అయ్యామని .. ఇలి విచిత్రంగా చెబుతుంటారు కానీ ఓ హీరో మాత్రం తాను సినిమాల్లో హీరో కాకపోయి వుంటే పోరంబోకు అయ్యేవాడినని తనపై తానే షాకింగ్ కామెంట్ లు చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. స్టేజ్ పై అంతా వుండగానే హీరో ఇలా తన కెరీర్ గురించి ఇలా మాట్లాడటం అభిమానులని షాక్ కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే... బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా `గని`. మెగా ప్రిన్స్ వరున్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా యంగ్ టాలెంటెడ్ కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు ముద్దా అ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ గత కొన్ని నెలలుగా భారీ చిత్రాల కారణంగా వాయిదా పడతూ వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కన్నడ స్టార్ ఉపేంద్ర, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీని ఎట్టకేలకు ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ప్రత్యేకంగా ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ట్రైలర్ మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రంగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.
నదియా తల్లి పాత్రలో నటించగా ట్రైలర్ లో ఆమె పలికిన సంభాషణలు.. తల్లికిచ్చిన మాటని తప్పి నిజాన్ని దాచి బాక్సర్ గా నేషనల్ ఛాంపియన్ కావాలని హీరో ప్రయత్నిస్తున్న తీరు, ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లని చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా వుంటే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ తనపై తానే సెటైర్లు వేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
సినిమాల్లో హీరో కాకపోయి వుంటే తాను ఎక్కడో పోరంబోకుగా పని లేకుండా తిరుగుతుండే వాడినని, సినిమా నాకు డిసిప్లెన్ ని నేర్పించిందని, అందుకు తనకు సినిమా అంటే గౌరవం అని, అందుకే సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను. ఈ సినిమా కోసం బాక్సర్ గా శ్రమించి బాడీని పెంచినా.. రేపు మరో సినిమా కోసం ఏదైనా చేసినా అంతా మీ కోసమే అని అభిమానులనుద్దేశించి మాట్లాడటం పలువురిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.