టాలీవుడ్ స్టార్ హీరోలు కరోనా ముందు వరకు ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేసుకుంటూ వచ్చారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను విడుదల చేస్తూ వచ్చారు. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేయడమే గగనంగా మారేది. అలాంటి పరిస్థితి నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోలు దూసుకు పోతున్నారు. కరోనా తీసుకు వచ్చిన మార్పులో ప్రధాన మార్పు ఖచ్చితంగా హీరోల సినిమాల ఎంపిక ఒకటి.
ప్రస్తుతం టాలీవుడ్ దాదాపు అందరు యంగ్ స్టార్ హీరోలు కూడా చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లను పట్టుకుని ఉన్నారు. కొందరు అరడజను ప్రాజెక్ట్ లు కూడా చేస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ అందుకు విభిన్నం ఏమీ కాదు. ఇప్పటికే వరుణ్ తేజ్ నటించిన గని మరియు ఎఫ్ 3 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సమ్మర్ లోనే ఈ రెండు సినిమాలతో వరుణ్ తేజ్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగానే మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పేశాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ సినిమా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ సమ్మర్ లోనే ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సినిమా మాత్రమే కాకుండా ఒక పాన్ ఇండియా స్క్రిప్ట్ కు వరుణ్ తేజ్ ఓకే చెప్పాడట. కొత్త దర్శకుడితో హిందీ మరియు తెలుగు లో రూపొందబోతున్న ఆ పాన్ ఇండియా సినిమాను గని నిర్మాత సిద్దు ముద్ద భారీ బడ్జెట్ తో సోనీ పిక్చర్స్ వారితో కలిసి నిర్మించబోతున్నాడు. ఆ సినిమా ను ఇదే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సినిమా లు రెండు విడుదలకు సిద్దంగా ఉండగా మరో రెండు సినిమాలకు సైన్ చేసిన వరుణ్ తేజ్ తన కెరీర్ ను చాలా తెలివిగా గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో ఏమాత్రం గ్యాప్ లేకుండా మెగా హీరోలు అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఎఫ్ 3 మరియు గని రెండు సినిమాలు కూడా సక్సెస్ అవుతాయనే నమ్మకంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరో వైపు కొత్తగా కమిట్ అయిన రెండు సినిమాలు కూడా మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి కనిపిస్తుంది. మంచి పర్సనాలిటీ ఉండే వరుణ్ కు ఖచ్చితంగా పాన్ ఇండియా ఇమేజ్ దక్కుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.