బాలీవుడ్ లో అత్యంత క్రేజీ హీరోయిన్ ల జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది అలియా భట్. పరిణతి కలిగిన నటనతో ఆకట్టుకుంటూ దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. అదే ఆమెని రాజమౌళి దృష్టిలో పడేలా చేసింది. పెర్ఫార్మెన్స్తో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంటున్న అలియాభట్ ఈ ఏటి మేటి మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' తో తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటిస్తున్న ఈ భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ముందు ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 7న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందు కోసం భారీ స్థాయిలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు 20 కోట్లు ప్రమోషన్స్ కోసం ఖర్చు చేశారు. బాలీవుడ్ లో వారం రోజుల పాటు 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ ప్రత్యేకంగా స్టే చేసింది. అక్కడే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి అలియా భల్ పాల్గొనగా పలు మీడియా సంస్థల్లో ప్రచార కార్యక్రమాల్ని రాజమౌళి నిర్వహించారు.
హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూర్, కేరళ వంటి తదితర ప్రదేశాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే చివరి క్షణాల్లో 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ వాయదా పడటంతో చిత్ర బృందం పడిన శ్రమంత వృధా అయిపోయింది. అయితే తాజాగా రిలీజ్ డేట్ మార్చి 25కు మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో సారి రాజమౌళి భారీ స్థాయిలో ప్రమోషనల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేశారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సిటీల్లో భారీ సెట్ లని నిర్మించి 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోసనల్ ఈవెంట్స్ ని భారీ ఎత్తున నిర్వచేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.
అయితే ఈ సారి రామ్ చరణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి హీరోయిన్ అలియా భట్ మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం పాల్గొనడంతో మరో సారి అలియా డేట్స్ కేటాయించలేకపోతోందట. ఆ కారణంగానే అలియా భట్ 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతోందని చెబుతున్నారు. అంతే కాకుండా అలియాభట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లలో నటిస్తోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ కోసం ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేసింది.
ఇంత బిజీగా వుండటం వల్ల అలియా ఈ మూవీ ప్రమోషన్స్ కి రావడం లేదని చెబుతున్నారు. గతంలో అలియా భట్ 15 రోజలు పాటు ప్రమోషన్స్ కి డేట్స్ కేటాయించింది. అందు కోసం మేకర్స్ ఏకంగా 3 కోట్లు పారితోషికం కూడా చెల్లించారట. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్.. సిబ్బంది ఖర్చులు, అకామిడేషన్ ఖర్చులు కూడా భరించారట. మరో సారి అలియాభట్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసే మూడ్ లో మేకర్స్ కూడా లేరని తెలుస్తోంది.
అంతే కాకుండా తన కారణంగా సౌత్ లో సినిమాకు ఎక్స్ట్రా మైలేజ్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అందుకే ముంబైలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం అలియాని ఇన్వయిట్ చేస్తున్నారట. ఇదిలా వుంటే 'రాధేశ్యామ్' తరహాలో రిలీజ్ ట్రైలర్ ని కూడా రాజమౌళి సిద్ధం చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.