చిన్న దేవ‌ర‌కొండ‌ని సూప‌ర్ స్టారేంజ్ లో వాడేస్తున్నారే!

Update: 2022-03-15 16:30 GMT
స్టార్ హీరోల బ‌ర్డ్ డే సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఏ రేంజ్ లో హ‌డావుడి చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. పుట్టిన రో జు సంద‌ర్భంగా ఆ హీరో ఎన్ని సినిమాల్లో న‌టిస్తే అన్ని సినిమాల‌కు సంబంధించిన ప్ర‌చార చిత్రాల్ని పోటా పోటీగా రిలీజ్ చేస్తుంటారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్..ట్రైల‌ర్..టీజ‌ర్..హీరో క్యారెక్ట‌రేజేష‌న్ ఎలివేష‌న్ కి సంబంధించిన ప్రోమోలు కావొచ్చు. ఇలా ఏదైనా స‌రే హీరో క్రేజ్ ని మాత్రం త‌మ సినిమా కోసం ఓ రేంజ్ లో విన‌యోగించుకునే కార్య‌క్ర‌మం  ఉంటుంది. స్టార్ హీరోల‌కు ఇలాంటి త‌ప్ప‌వు. నిర్మాత‌లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. హీరో ప్ర‌మోష‌న్ కి హాజ‌ర‌వ్వాల్లా? వ‌ద్దా ? అన్న‌ది అత‌ని ఇష్టం మీద‌న ఆధార‌ప‌డి ఉంటుంది.

ఆ విష‌యంలో హీరోని డిమాండ్ చేయ‌డానికి లేదు.  అందుకే రాక రాక వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని మేక‌ర్స్ విడిచిపెట్టరు. సంద‌ర్భం ఏదైనా స‌రే..హీరో పేరుతో  సినిమా మార్కెట్ లో కి వెళ్లిపోయేలా ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతుంటారు. స్టార్ హీరోలు కాబ‌ట్టి ఆ త‌ర‌హా ప్ర‌చారం సినిమాకి ప‌నికొస్తుంది. తాజాగా ఓ యంగ్ హీరో విష‌యంలోనూ ప‌లువురు మేక‌ర్స్ ఇదే స్ర్టాట‌జీతో ఈరోజు ముందుకు క‌దిలిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఉద‌యం నుంచి అదే ప‌నిగా యంగ్ హీరో పేరిట కొత్త పోస్ట‌ర్ల‌ని నెట్టింట వ‌దులుతున్నారు. ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఈ యంగ్ స్టార్ ని  సూప‌ర్ స్టార్ రేంజ్ లో ఊహించుకుని సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకుంటున్నారు.

మంగ‌ళ‌వారం ఆనంద్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న న‌టిస్తున్న సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్లన్నీ ఈరోజు ఉద‌యం నుంచే ఒక్కొక్క‌టిగా రిలీజ్ అవుతున్నాయి . ఇప్ప‌టికే 'బేబి'..'హైవే' చిత్రాల పోస్ట‌ర్స్ రిలీజ్ చేసి ఆనంద్ కి విషెస్ తెలియ‌జేసారు. తాజాగా 'గంగం గ‌ణేశా' పోస్ట‌ర్ కూడా రిలీజ్  అయింది. 'హ్యాపీ బ‌ర్త డే అవ‌ర్ హీరో'  ఆనంద్ దేవ‌ర‌కొండ అంటూ ఓ కొత్త‌ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. పోస్ట‌ర్ పైన 'ది గ‌ణేశ్ లోడింగ్' అంటూ కింద ఆనంద్ కామిక్ పిక్ ని డిజైన్ చేసి వ‌దిలారు.

ఇలా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల ఆ హీరో పేరుతో సినిమా మార్కెట్ ఎలా జ‌రుగుతుంది? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే యంగ్ హీరో పేరు మాత్రం నెట్టింట మారుమ్రోగుతుంది. సాధార‌ణంగా హీరో పేరుతో సినిమా మార్కెట్ లోకి వెళ్తుంది.

కానీ ఇక్క‌డ స‌న్నివేశం అందుకు  భిన్నంగా ఉంద‌ని విమ‌ర్శ  వినిపిస్తోంది. సినిమా టైటిల్స్ తో  హీరో ప్రేక్ష‌కుల ముందుకు వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంద‌ని పలువురు కామెంట్లు చేస్తున్నారు. స‌రే కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ యంగ్ హీరోకి మ‌రొక్కసారి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.
Tags:    

Similar News