తెలుగులో ముందువరుసలో ఉన్న గేయరచయితలలో అనంత శ్రీరామ్ కనిపిస్తాడు. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నేరుగా ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాడు తను. ఒక వైపున సిరివెన్నెల సీతారామశాస్త్రి .. మరో వైపున చంద్రబోస్ తమ కలాన్ని పరుగులు తీయిస్తున్న సమయంలో అనంత శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు.
సాధారణంగా ఇంగ్లిష్ మీడియం చదువులు .. ఇంజనీరింగ్ కుర్రాళ్లు అంటే సహజంగానే కాస్త తెలుగు మీద పట్టు తక్కువగా ఉంటుంది. కానీ అనంత శ్రీరామ్ ఒక వేదిక మీద తన మాటల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా దొర్లకుండా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కుర్రాడిలో తెలుగు పాళ్లు చాలా ఎక్కువే అనుకునేలా చేశాడు.
అనంత శ్రీరామ్ మంచి భావావేశం ఉన్న యువకుడు. ప్రేమ పాటలను చాలా తేలికైన పదాలతో .. లోతైన అర్థాలతో రాయడం ఆయన ప్ర్రత్యేకత. ఇప్పటి పాటల్లో సాహిత్యం పెద్దగా కనిపించడం లేదండీ .. అన్నీ పొడిపొడిగా అక్షరాలు పేర్చేయడం తప్ప అనుకునేవారికీ, అనంత శ్రీరామ్ పాటల్లో మనసుకు పట్టుకునే పదాలు .. హృదయాన్ని తాకే భావాలు కనిపిస్తాయి.
ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలు సైతం అనంత శ్రీరామ్ తో పాటలు రాయిస్తే బాగుంటుందని సిఫార్స్ చేసే స్థాయికి చేరుకున్నాడు.
చాలా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన అనంత శ్రీరామ్ కలం నుంచి ఇప్పటికే వందల పాటలు వచ్చాయి. అనంత శ్రీరామ్ మంచి పాటకారి .. మాటకారి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తనలో ఒక ఆటకారి కూడా ఉన్నాడనే విషయాన్ని ఆయన బయటపెట్టాడు.
జీ టీవీవారు 'సరిగమప' అనే ఒక మ్యూజికల్ షోకి అనంత శ్రీరామ్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆ షో ఆనవాయితీ ప్రకారం ఒక డాన్స్ తో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. రాముడు మంచి బాలుడులా కనిపించే ఆయన ఎంట్రీ చాలా డీసెంట్ గా ఉంటుందనే అంతా అనుకున్నారు.
కానీ అనంత శ్రీరామ్ అందరి అంచనాలను తారుమారు చేసి పారేశాడు. ఒక్కసారిగా తన కాళ్లకు .. చేతులకు పని చెబుతూ స్టేజ్ పై బొంగరంలా తిరిగిపోయాడు. నిజానికి ఆయన చేసిన ఫీట్ చాలా కష్టమైంది కూడా. అయితే ఈ షో కోసం అది ఆయన నేర్చుకున్నది కాదు. ఆల్రెడీ ఆయనకి ఇందులో మంచి ప్రావీణ్యం ఉన్నట్టుగానే కనిపించింది.
ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడే ఆయన ఇందులో ప్రవేశాన్ని సంపాదించి ఉంటాడు. ఇంతకాలంగా తనలో నిద్రాణంగా ఉన్న ఈ టాలెంట్ ను ఈ షో ఒక్కసారిగా తట్టిలేపింది. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో చూసిన వాళ్లంతా 'అమ్మ అనంత శ్రీరామా .. ! నీలో ఇంత బీభత్సమైన యాంగిల్ కూడా ఉందా? అంటూ షాక్ అవుతున్నారు.
Watch Video Here : https://twitter.com/TTUpdates360/status/1501596961949958145?s=20&t=klwIA7DVZqvI7q0QMWqMGg