తన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం అంటోంది

Update: 2022-03-13 06:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్ ఇప్పటి వరకు వెండి తెర పై మాత్రమే సందడి చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె బుల్లి తెరపై సందడి చేస్తోంది. వెండి తెరపై లేడీ సూపర్ స్టార్ గా ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ ను చేసిన కంగనా రనౌత్ ఇప్పుడు లాకప్ అనే టాక్ షోలో తన రియాల్టీ రోల్ ని చూపించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాకప్ రియాల్టీ షో చేసే సమయంలో ఆమెపై పలు రకాల విమర్శలు వచ్చాయి.

కంగనా వంటి ఫైర్‌ బ్రాండ్‌ కి ఇలాంటి షో ఎలా సూట్‌ అవుతుంది అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా కంగనా రనౌత్ సక్సెస్‌ ఫుల్ గా నిలిపింది. అద్భుతమైన ఎపిసోడ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సఫలమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఎక్కడ చూసినా కూడా ఈ షో గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఆమె ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ షో కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పు కొచ్చింది. కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి నిర్మాత గా ఏక్తాకపూర్ వ్యవహరిస్తుంది. బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ ని ఎప్పటి కప్పుడు విమర్శించే కంగనా రనౌత్ ఎలా ఏక్తా కపూర్ నిర్మాణంలో వర్క్ చేస్తుంది అనేది చాలా మంది మొదట అడిగిన ప్రశ్న.

ఆ విషయమై కంగనా రనౌత్ స్పందిస్తూ ఏక్తా కపూర్ ఒక పెద్ద స్టార్‌ కుటుంబానికి చెందిన మహిళ అయినా కూడా ఆమె ఎప్పుడు కూడా తన తండ్రి పేరును వినియోగించుకోకుండా తన సొంత టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగారు.

ఆమె అంటే తనకు గౌరవం అందుకే ఆమె చేయమని అడిగినప్పుడు కాదనలేక పోయాను అంది. హీరోయిన్ గా సినిమాల్లో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించాను. కానీ నిజ జీవితంలో తాను ఏంటి... తన యొక్క నిజ స్వరూపం ఏంటి... నా వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ షో ను చేయాలని భావించాను.

ఆ సమయంలో ఏక్తా కపూర్ నాతో అన్న మాటలు నాలో నమ్మకాన్ని మరింతగా పెంచాయి. ఇప్పటి వరకు సినిమాల్లో నటించడం ద్వారా నీ వ్యక్తిత్వం ఏంటి.. మీ యొక్క బలాలు బలహీనతలు ఏంటి అనేది తెలియలేదు. కానీ షో చేయడం ద్వారా నీకు ఆ వాటన్నిటిపై ఒక అవగాహన వస్తుంది. నీ యొక్క ప్రతిభ జనాలకు మరింతగా చేరే అవకాశం ఈ షో కల్పిస్తుంది అంటూ తెలియజేసింది.

అందుకే ఎక్కువ ఆలోచించకుండా లాకప్‌ చేసేందుకు సిద్దం అయ్యాను అంటూ కంగనా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కంగనాపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన వారిని కూడా ఈ షో కి తీసుకు రావడం ద్వారా మంచి పబ్లిసిటీ మరియు హైప్ క్రియేట్ చేయడంలో నిర్వాహకులు సఫలమయ్యారు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ముందు ముందు ఈ షోకు కంగనా వరుస సీజన్‌ లు నిర్వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News