'రాధేశ్యామ్' .. ఇప్పుడు అందరినోటా ఇదే పేరు వినిపిస్తోంది. ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది ఇటలీ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ. తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం .. తన ప్రేమను నెగ్గించుకోవడం కోసం హీరో చేసే సాహసమే ఈ సినిమా. అలాంటి ఈ సినిమా సాంకేతిక పరమైన అద్భుతాలను కూడా తెరపై ఆవిష్కరించనుంది.
ఈ కథ అంతా కూడా ఇటలీలో ఎక్కువగా జరుగుతుంది. అందువలన అక్కడ నాన్ స్టాప్ షూటింగు జరపాలనే నిర్ణయంతో వెళ్లారు. కొంత చిత్రీకరణ జరిగిన తరువాత కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించలేదు. కరోనా ఎప్పుడు పోతుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అక్కడ షూటింగుకి మళ్లీ ఎప్పటి నుంచి అనుమతులు దొరుకుతాయనేది ఎవరూ చెప్పే పరిస్థితులు లేవు. అలాంటి సమయంలోనే మేకర్స్ ఆలోచనలో పడ్డారు. ఇటలీకి సంబంధించిన సెట్స్ ను ఇక్కడ వేసి పని పూర్తిచేయడమే మంచిదనే సలహా ప్రభాస్ ఇవ్వడంతో అందుకు శ్రీకారం చుట్టారు.
అలా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రంగంలోకి దిగేసి .. ఇటలీ నగరాన్ని తలపించేలా ఈ సినిమా కోసం 101 సెట్లను వేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ కథ జరుగుతున్నంత సేపు తాము ఇటలీలోనే ఉన్నామనే ఫీలింగ్ ను ప్రేక్షకులు పొందాలి. అందుకోసం ఖర్చుకు వెనుకాడకుండా 101 సెట్లను వేశారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ సినిమా భారీతననానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటలీ వీధుల్లో .. భవనాల్లో .. ఉద్యానవనాల్లో తీయవలసిన దృశ్యాలను సెట్స్ లో చిత్రీకరించారంటే ఏ స్థాయిలో ఖర్చు చేశారో .. కసరత్తు చేశారో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు సినిమాలనేవి సెట్స్ లోనే మొదలై అక్కడే పూర్తయ్యేవి. ఆ తరువాత అవుట్ డోర్ షూటింగుల వైపు అంతా మొగ్గు చూపారు. జనాల చేతుల్లోకి మొబైల్ ఫోన్లు రానంతవరకూ ఈ విధానమే కొనసాగింది. మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడం వలన అవుట్ డోర్స్ లో షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. అలా ఎక్కడ షూటింగు పెట్టుకున్నా క్షణాల్లో జనాలకి తెలిసిపోయి లొకేషన్ కి వచ్చేస్తున్నారు.
అంతేకాదు లొకేషన్ లోని ఫోటోస్ బయటికి వెళుతున్నాయి. అందువలన మళ్లీ సెట్స్ లోనే సినిమా షూటింగులు జరుగుతున్నాయి. 'బాహుబలి' .. 'రంగస్థలం' .. ' శ్యామ్ సింగరాయ్' కోసం వేసిన సెట్స్ ఆ సినిమాలకి హైలైట్స్ గా నిలిచాయి. అలాగే 'రాధే శ్యామ్' సెట్స్ కూడా ప్రత్యేకతను సంతరించుకుని ప్రశంసలను అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.