మొదటి నుంచి కూడా కార్తి విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. తమిళనాట గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తన నటనలో ఎక్కడా కూడా అతి అనేది లేకుండా చూసుకుంటాడు. సాధ్యమైనంత సహజత్వంతో తన పాత్రలను ప్రేక్షకులకు దగ్గరగా తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. 'ఖాకి' .. 'ఖైదీ' సినిమాలు ఆయన నటనకు కొలమానంగా నిలుస్తాయి. అయితే 'ఖైదీ' తరువాత ఆయనకి ఆ స్థాయి హిట్ పడలేదు .. ఆ స్థాయి వసూళ్లను ఆయన చూడలేదు.
ప్రస్తుతం ఆయన నుంచి రావడానికి 'విరుమాన్' .. 'సర్దార్' సినిమాలు రెడీగా ఉన్నాయి. 'విరుమాన్' సినిమాను సూర్య నిర్మించగా ముత్తయ్య దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ పరిచయమవుతోంది.
ఇక 'సర్దార్' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాను లక్ష్మణ్ కుమార్ నిర్మించగా పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కార్తి సరసన నాయికగా రాశి ఖన్నా అందాల సందడి చేయనుంది.
ఈ సినిమా తమిళ స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా' ఓటీటీ సంస్థవారు దక్కించుకున్నారనేది తాజా సమాచారం. 'సర్దార్' సినిమాలో కార్తి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇక తమిళనాట దర్శకుడిగా మిత్రన్ కి మంచి ఇమేజ్ ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అందువలన ఈ సినిమా థియేటర్స్ కి వెళ్లకుండానే 'ఆహా'వారు తమిళ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు. ఇందుకోసం వారు 20 కోట్లను చెల్లించినట్టు తెలుస్తోంది. రిలీజ్ కి ముందే ఈ సినిమా పెట్టుబడిలో చాలావరకూ స్ట్రీమింగ్ హక్కుల రూపంలో పొందడం విశేషంగానే చెప్పుకోవాలి.
'సర్దార్' సినిమా థియేటర్స్ లో సందడి చేసిన తరువాత అగ్రిమెంట్ ప్రకారం 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తుంది. రాశి ఖన్నాతో పాటు రజీషా విజయన్ మరో కథానాయికగా అలరించనుంది. ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రను మురళీశర్మ పోషించాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కార్తికి ఈ సినిమాతో నైనా హిట్ పడుతుందేమో చూడాలి. అలాగే అక్కడ రాశి ఖన్నా జోరు పెరిగేలా చేస్తుందేమో అనేది కూడా తేలాలి.