ప‌వ‌న్ తో ముడిపెట్టి అషుని తిట్టేస్తున్నారు!

Update: 2022-10-16 01:30 GMT
అందాల క‌థానాయిక‌లు విదేశీ విహార‌యాత్ర‌ల నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ భారీగా అనుచ‌రుల‌ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీనేజీ యూత్ ని టార్గెట్ చేస్తూ వేడెక్కించే బికినీ షూట్లతో చెల‌రేగుతున్నారు. ఇందుకు తెలుగ‌మ్మాయిలు అతీతం కాద‌ని నిరూపిస్తున్నారు. నేటి ట్రెండ్ లో మెట్రో సిటీ హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన భామ‌లు బెంగ‌ళూరు కోల్ క‌తా దిల్లీకే పోటీకెళుతున్నారు.

ఉన్న‌త విద్యాభ్యాసం అనంత‌రం మోడ‌లింగ్ రంగాన్ని సినీకెరీర్ ని ఎంపిక చేసుకుని ఈ రంగాల‌లో రాణిస్తున్నారు. ఇంత‌కుముందు జూనియ‌ర్ స‌మంత‌గా పాపుల‌రై బిగ్ బాస్ లో అవ‌కాశం అందుకుంది అషురెడ్డి. ఈ షో త‌న‌కు అంతో ఇంతో మైలేజ్ ఇచ్చిన మాట వాస్త‌వం. పోలిక‌ల ప‌రంగా కొంత స‌మంత‌ను పోలి ఉండ‌డంతో అది త‌న‌కు ప్ల‌స్ అయ్యింది.

కానీ దానివ‌ల్ల సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రావ‌ని చాలా వేగంగానే గ్ర‌హించిన‌ట్టుంది. ఇప్పుడు త‌న‌వంతుగా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ‌రుస పోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది.

ఇంత‌కుముందు ఆర్జీవీతో అషు రెడ్డి బ్లాస్ట్ ఇంట‌ర్వ్యూ ఎంత‌గా వైర‌ల్ అయ్యిందో తెలిసిందే. ప‌బ్లిసిటీ స్టంట్ ని ప‌రాకాష్ట‌కు చేర్చ‌డ‌మెలానో ఆర్జీవీ నేర్పించారు. ఇటీవ‌ల అషు గురువుగారి బాట‌ను ఎంచుకుంది.

స‌డెన్ గా విదేశాల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ విలాస‌వంత‌మైన భవంతుల న‌డుమ వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. మ‌రోవైపు బికినీ షూట్లతోను దుమారం రేపేందుకు వెన‌కాడ‌డం లేదు. తాజాగా అషు ఓ ఫోటోషూట్ ని షేర్ చేసి ఇందులో నా రెండో ఫోటో సంథింగ్ స్పెష‌ల్ అంటూ ఊరించింది. నిజ‌మే.. ఈ ఫోటోగ్రాఫ్ లో అషు అర్థ‌నగ్నంగా క‌నిపించ‌డ‌మే గాక ఇన్న‌ర్ దేహ‌శిరుల‌పై ప‌చ్చబొట్లు హాట్ గా క‌నిపిస్తున్నాయి. అంత‌కుముందే షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ యాక్ట్ ని మించి ఈ ఫోటోలో హాట్ గా క‌నిపిస్తోంది. ఆచ్ఛాద‌న జారిపోతున్న అందాల‌ను తెర‌ప‌రుస్తూ క‌వ్విసోంది.

ఇక ఈ ప‌బ్లిసిటీ స్టంట్ ని ఆపితే అషు టీవీషోల‌తో బిజీగా ఉంది. త‌దుప‌రి వెండితెర‌పై పెద్ద ఎంట్రీ ఎప్పుడు? అన్న‌ది వేచి చూడాలి. అయితే ప్ర‌తిసారీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అభిమానిని అని చెప్పుకునే అషుపై నెటిజ‌నులు విరుచుకుప‌డుతున్నారు. ఆ పేరుతో త‌న పేరును ముడి వేయొద్ద‌ని నెటిజ‌నులు సూచిస్తున్నారు. ఈ సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకుంటుందేమో చూడాలి.


Tags:    

Similar News