యంగ్ హీరో సందీప్ కిషన్ ఈమద్య కాలంలో చేసిన సినిమాలు దాదాపు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూ వచ్చాయి. మంచి కాన్సెప్ట్ కథలను ఎంపిక చేసుకుని విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సందీప్ కిషన్ విమర్శకుల ప్రశంసలు అయితే దక్కించుకుంటున్నాడు కాని కమర్షియల్ గా మాత్రం సక్సెస్ లను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు.
కమర్షియల్ సక్సెస్ ల కోసం తెలుగు తో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తున్న ఈ యంగ్ హీరో మరో వైపు నిర్మాతగా కూడా తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు తన సొంత సినిమాలను సన్నిహితులతో కలిసి నిర్మించిన సందీప్ కిషన్ త్వరలోనే బయటి హీరోలతో సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
కెరీర్ లో తన మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోలతో డీల్ కుదుర్చుకుని సినిమాలను నిర్మించేందుకు సందీప్ కిషన్ సిద్దం అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఇలా కరీర్ లో నిర్మాతగా మారడం అనేది ఖచ్చితంగా సాహస నిర్ణయం. చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారారు కాని పార్ట్ టైమ్ గా మాత్రమే వారు నిర్మాణం చేపడుతున్నారు.
సందీప్ కిషన్ మాత్రం సన్నిహితులతో కలిసి పూర్తి స్థాయిలో నిర్మాతగా మారాలని.. అది కూడా రెగ్యులర్ గా సినిమాలను ఇతర హీరోలతో నిర్మించాలని భావిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఆయన కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా మరియు నిర్మాతగా రెండు పడవల ప్రయాణం అనేది కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని ఈతరం యంగ్ హీరోలు ఖచ్చితంగా రెండు పడవల ప్రయాణం కాదు.. మూడు నాలుగు పడవల ప్రయాణం చేసినా కూడా సేఫ్ గా ఒడ్డుకు చేరేంతటి ట్యాలెంట్ ఉన్న వారు. కనుక సందీప్ కిషన్ విషయంలో అనుమానం అక్కర్లేదు అంటూ కొందరు ఆయన సన్నిహితులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈయన తెలుగు లో నిర్మాణం చేయబోతున్నాడు.
నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పాత్రలు చేసేందుకు సందీప్ కిషన్ ఓకే చెబుతున్నాడు. కనుక నిర్మాతగా కూడా ఆయనకు మంచి భవిష్యత్తు ఉందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాలున్న మైఖేల్ సినిమా తో విజయ్ సేతుపతితో కలిసి సందీప్ కిషన్ రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు లో నిర్మాతగా సందీప్ కిషన్ త్వరలోనే సినిమాలను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అందుతోంది.