మానవాళి సిగ్గుపడేలా చోటు చేసుకున్న ఈ దారుణ నిజాన్ని గడిచిన ముప్ఫై ఏళ్లుగా ఎవరికి వారు తమ శక్తి వంచన లేకుండా దాచి పెట్టిన వేళ.. ఆ కఠోర నిజాన్ని తన తాజా మూవీ కశ్మీర్ ఫైల్స్ తో బయటపెట్టారు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇంత దారుణం జరిగితే.. ఇప్పటివరకు స్పందించని రాజకీయ పక్షాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కొందరు ఎప్పటిలానే సన్నాయి నొక్కులు నొక్కుతూ.. సూడో సెక్యులరిజం మాటల్ని మాట్లాడుతున్నారు. సినిమాటిక్ స్వేచ్ఛ తీసుకున్న దర్శకుడు.. ఎప్పటిలానే జరిగింది కొంత అయితే.. దానికి మసాలా దట్టించారంటూ నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి వారికి మనసు ఎలా ఒప్పిందన్నది ప్రశ్నగా మారింది.
థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్న వారంతా కళ్లప్పగించి చూస్తుండిపోవటమే కాదు.. కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతటి దారుణం జరిగిందా? దాని గురించి ఏ వ్యవస్థా ఇప్పటివరకు చెప్పక పోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీలో అవసరానికి మించిన నాటకీయతను చొప్పించినట్లుగా కొందరు తప్పు పడుతుంటే.. అసలు జరిగిన దానితో పోలిస్తే.. సినిమాలో చూపించింది కేవలం పది శాతమేనని చెబుతున్నారు.
ఇలాంటి వేళ.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దబాంగ్ 2, హీరోపంతి మూవీల్లో హీరోయిన్ గా మెరిసి.. అందరి మనసుల్ని దోచుకున్న బాలీవుడ్ నటి సందీప కశ్మీర్ లోని పండిట్ల కుటుంబంలో పుట్టింది. 1990లో జరిగిన దారుణ మారణకాండ నుంచి వారి కుటుంబం తప్పించుకుంది. కశ్మీర్ నుంచి వలస వెళ్లిపోయింది. కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసిన ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఒక సంచలన నిజాన్ని బయటకు చెప్పింది. ఆమె ఏమన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
"కశ్మీర్ పండిట్లు కశ్మీర్ గడ్డను వదిలి వెళ్లాలని ప్రకటించిన రోజు. అప్పుడు మా ఫ్యామిలీ మేం ఉన్న ప్రాంతాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది. కశ్మీర్ ను వదిలి వెళ్లేందుకు ట్రక్కు వెనుక భాగంలో దూరిపోయాం. నా కజిన్ ఒకరు మా నాన్నకాళ్ల కింద ఉన్న సీటు కింద దాక్కుంది. సరిగ్గా ఇదే సీన్ కశ్మీర్ ఫైల్స్ లో ఉండటంతో నేను షాక్ తిన్నా. నా కథను నేను మళ్లీ చూసుకుంటున్నట్లుగా అనిపించింది. మా అమ్మానాన్నల పరిస్థితి మరింత ఘోరం. సినిమా చూశాక నాటి దారుణ జ్ఞాపకాల నుంచి ఇప్పటికి బయటకు రాలేకపోతున్నారు. మా నానమ్మ చనిపోయింది. ఆమె పుట్టి పెరిగిన గడ్డ కశ్మీరే. ఇప్పటికి మాకు న్యాయం జరగలేదు. మాకు జరిగింది ప్రపంచానికి చెప్పటానికి నాకు చాలా కాలమే పట్టింది. నిజాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి థ్యాంక్స్. అనుపమ్ ఖేర్ తో సహా ఈ మూవీలో నటించిన నటీనటులందరికి నా హ్యాట్సాఫ్" అని పేర్కొంది.
జరిగిన వాస్తవానికి మోతాదు మించిన నాటకీయతను జోడించినట్లుగా మాట్లాడే కుహనావాదులు ఇప్పటికైనా నోరు మూస్తారా?