భీమ్లా నాయక్ వల్ల ఆమె పాత ఫోటోలు ఇప్పుడు వైరల్‌

Update: 2022-03-08 05:33 GMT
భీమ్లా నాయక్ సినిమా లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించిన విషయం తెల్సిందే. ఇక మరో కీలక పాత్రలో నటించిన రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్త మీనన్ లుక్ చాలా సింపుల్‌ అండ్ హౌస్ వైఫ్‌ పాత్ర. మొదటి సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంయుక్త మీనన్ మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాని ఆమె పాత్ర విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి ఉంది.

సంయుక్త మీనన్ ను ఎక్కువగా వాడుకోలేక పోయారు అనేది టాక్. ఆమె గతంలో నటించిన సినిమాల్లో మంచి నటనతో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తన అందాల వింధుతో ఆహా అనిపించింది. ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా తన నటనతో ఆకట్టుకున్న సంయుక్త మీనన్ అందాల విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలో సంయుక్త మీనన్ పాత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

భీమ్లా నాయక్ సినిమా తో సంయుక్త కు తెలుగు లో మంచి గుర్తింపు దక్కింది. దాంతో ఆమె నటించిన గత సినిమాల గురించి మరియు ఆమె పాత ఫోటో షూట్స్ గురించి తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఈ ఫోటోలు గతంలో సంయుక్త మీనన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బికినీ ట్రీట్‌ తో అభిమానులను వావ్‌ అనిపించేలా చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలను తెలుగు ప్రేక్షకులు తెగ షేర్ చేస్తున్నారు.

మలయాళం సినిమాలతో ఇన్నాళ్లు కాలం గడిపేసిన సంయుక్త మీనన్ కు ఇక మీదట టాలీవుడ్‌ లో వరుస గా ఆఫర్లు రావడం ఖాయం అంటూ టాక్ వినిపిస్తుంది. భీమ్లా నాయక్ సినిమా లో మెయిన్‌ లీడ్‌ రోల్‌ కాకున్నా కూడా చేసినందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి ఎంట్రీ అయితే దక్కిందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట భారీగా షేర్‌ అవుతున్న ఈ ఫోటోలను మీరు ఒక లుక్కేయండి.

భీమ్లా నాయక్‌ విడుదల అవ్వడమే ఆలస్యం ఈమెకు టాలీవుడ్‌ లో ఒకటి రెండు ఆఫర్లు అప్పుడే తలుపు తట్టాయి అంటున్నారు. టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.

మరో వైపు  మలయాళంలో ఈమె రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌ లో ఈమెకు అవకాశం ఇవ్వాలే కాని ఖచ్చితంగా అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేయడం ఖాయం అనిపిస్తుంది.
Tags:    

Similar News