తుంటరి పాప.. మహేష్ కి ఫ్లాట్‌

Update: 2015-12-22 15:23 GMT
లతా హెగ్డే.. త్వరలో టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతోంది ఈ సుందరి. నారా రోహిత్ సరసన తుంటరి మూవీతో తన ట్యాలెంట్ చూపించనుంది లత. ఇండియాలోనే పుట్టినా.. ఈమెకు ఏడేళ్ల వయసున్నపుడే పేరెంట్స్ న్యూజిలాండ్ కు షిఫ్ట్ అవడంతో.. అక్కడే ఆక్లాండ్ లో పెరిగింది ఈమె.

మిస్ ఇండియా న్యూజిలాండ్ ఈవెంట్ లో లతా హెగ్డేను చూసిన డైరెక్టర్ కుమార్ నాగేంద్ర.. మూడు నెలలు కష్టపడి మొత్తానికి అడ్రస్ పట్టుకున్నాడు. తెలుగు సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ చేసినా.. ఇది ఫేక్ మెసేజ్ అనుకుందిట ఈమె. హైద్రాబాద్ లో తెలిసిన వాళ్లు ఉంటే వాళ్లద్వారా మొత్తానికి ఈ ఆఫర్ నిజమేనని అర్ధం చేసుకుందిట. నిజానికి టాలీవుడ్ మూవీస్ ని ఎక్కువగా చూసే అలవాటు లేని ఈ చిన్నది.. ఎక్కువగా కన్నడ హిందీ సినిమాలను మాత్రమే చూసేదిట. అయితే.. టాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో.. 7,200 మైళ్లు దాటేసి వచ్చి, హీరోయిన్ అయిపోయింది.

లతా హెగ్డేకి గతేడాది ఆగడు సినిమాని మాత్రం సందర్భం వచ్చిందిట. సూపర్ స్టార్ మహేష్ బాబుని ఆన్ స్క్రీన్ పై ఒకసారి చూడగానే ఫ్లాట్ అయిపోయింది లతా హెగ్డే. అలా మహేష్ బాబు.. ఈ ఎన్నారై  హీరోయిన్ ని ఇంప్రెస్ చేశాడన్నమాట. ఇదిలాఉంటే.. కోలీవుడ్ మూవీ మాన్ కరాటేకు రీమేక్ గా తెరకెక్కుతోంది తుంటరి. ఇందులో ఓ స్పోర్ట్స్ పర్సనాలిటీతో ప్రేమలో పడే అమాయకమైన అమ్మాయి పాత్రను లతా హెగ్డే పోషిస్తోంది. కన్నడ ఫ్యామిలీ అయినా.. తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెబ్తోంది లతా హెగ్డే.
Tags:    

Similar News