తుంటరి పిల్ల మహేష్ ఫ్యాన్ అంటోంది

Update: 2016-03-11 01:30 GMT
నారా రోహిత్ మూవీ తుంటరి రిలీజ్ కి రెడీ అయింది. కుమార్ నాగేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో లతా హెగ్డే హీరోయిన్ గా పరిచయం అవుతోంది. విడుదల సందర్భంగా ఈ కొత్త భామ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది. స్విట్జర్లాండ్ పెరిగిన కన్నడ భామ కావడంతో.. బాగా మోడ్రన్ ఈ వయ్యారి. ప్రెస్ మీట్ కి కూడా షోకులు ప్రదర్శించుకుంటూనే వచ్చేసింది.

బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ లో - క్లీవేజ్ షో చేస్తూ సందడి చేయడం - ఫోటోలకు పోజిలివ్వడంతో.. లతా హెగ్డేకి అందరూ బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. బెంగళూరులో పుట్టినా.. స్విట్జర్లాండ్ లో పెరిగానని.. మిస్ స్విట్జర్లాండ్ గా కూడా ఎంపికయ్యానని చెప్పింది. అందాలను బాగానే ఎక్స్ పోజ్ చేస్తోంది కానీ.. ఈ సుందరాంగికి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. ప్రెజెన్స్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా సూపర్బ్ అని యూనిట్ వర్గాలు అంటున్నా.. అమ్మడి మాటలు మాత్రం అంతా పొడిపొడిగానే ఉన్నాయి.

ఏదన్నా అడిగితే ఒక్క ముక్కలో సమాధానంతో సరిపెట్టేసింది లతా హెగ్డే. తన గురించి చెప్పుకోవడం రాలేదు. అలాగే ప్రాజెక్టు గురించి పెద్దగా ఏమీ ఎక్స్ ప్లెయిన్ చేయలేకపోయింది. అయితే.. మహేష్ బాబుని మాత్రం బాగా పొగిడేస్తూ.. ఆగడు సినిమా చూసి సూపర్ స్టార్ అభిమానిగా మారిపోయానని చెప్పడం విశేషం.
Tags:    

Similar News