ఈ మూవీకోసం చెమటచిందించా: లావణ్య 'ఏ1ఎక్స్ ప్రెస్' ఫుల్ ఇంటర్వ్యూ

Update: 2021-02-27 17:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీకి అందాలరాక్షసి అనే సినిమాతో పరిచయమైంది ముంబై బ్యూటీ లావణ్య త్రిపాఠీ. అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. కరోనా బ్రేక్ తర్వాత లావణ్య నుండి ఒకే నెలలో రెండు సినిమాలు 'ఏ1ఎక్సప్రెస్', చావుకబురు చల్లగా తెరమీదకు రాబోతున్నాయి. అయితే ఈ రెండింట్లో ముందుగా ఏ1 ఎక్సప్రెస్ మార్చ్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సందర్బంగా ఏ1 ఎక్సప్రెస్ సినిమాకు సంబంధించి లావణ్య తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకుంది. అవేంటో చూద్దాం!

* హాయ్.. లావణ్య గారు! ఒకే నెలలో మీ రెండు సినిమాలు వస్తున్నాయి. ఎలా ఫీలవుతున్నారు?
చాలా ఆనందంగా ఉంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం. ఎందుకంటే రెండు డిఫరెంట్ రోల్స్.

* సరే ముందుగా ఏ1ఎక్సప్రెస్ విడుదల కాబోతుంది కదా.. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది?

నేను ముంబైలో ఉన్నప్పుడు సందీప్‌ ను కలిశాను. అప్పుడే సందీప్ ఈ సినిమా గురించి చెప్పాడు. ఫస్ట్ సందీప్ చెప్పిన స్టోరీ లైన్ వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యా. అరే ఇలాంటి క్యారెక్టర్ నాకు కావాల్సింది అనిపించింది. ఎందుకంటే ఎంతకాలం రొటీన్ 'గర్ల్ నెక్స్ట్ డోర్' పాత్రలు చేయాలనీ.. బోర్ అనిపించింది. ఛాలెంజింగ్ రోల్ కోసం చూస్తున్న టైంలో ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చింది ఓకే చెప్పేశా.

* ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఈ సినిమాలో నా క్యారెక్టర్ రెగ్యులర్ లా ఉండదు. ఇప్పటివరకు చేసినవాటికీ పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. నిజానికి ఈ సినిమా తమిళరీమేక్‌ అయినప్పటికి టోటల్ స్క్రిప్ట్ చేంజ్ చేశారు. కథలో కూడా యాభైశాతం మార్పులు చేశారు డైరెక్టర్. నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటుంది. అందుకే ఈజీగా చేసేసాను.

*ఫస్ట్ టైం స్పోర్ట్స్ జానర్ కదా.. ఎలా సిద్ధమయ్యారు?

ఈ సినిమా హాకీ గేమ్ నేపథ్యంలో సాగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా వర్కౌట్స్ ఏమి చేయలేదు. ఎందుకంటే నేను రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తాను. అలాగే నా స్కూల్‌ డేస్‌లో బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. హాకీ స్కూల్లో ఉండేది కాదు కదా.. సినిమా చేసాక హాకీ స్కూల్స్ లో ఉండాలనిపించింది. హాకీ ప్లేయర్స్ బాడీలాంగ్వేజ్‌ కూడా ప్రత్యేకంగా చెన్నైలో కోచ్‌ సుధీర్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను.

*హాకీ గేమ్ ప్లేయర్ గా ఆడేటప్పడు ఎలా అనిపించేది?
ఈ సినిమా జరుగుతున్నంత కాలం జరిగిపోయిన పాత హాకి మ్యాచెస్ ఎక్కువగా చూసేదాన్ని. ఎందుకంటే నటిగా పాత్రలో సహజంగా ఉండాలన్నదే నేను నమ్ముతాను. సందీప్‌ నేనూ రెగ్యులర్‌ రోల్స్ చేయలేదు. నిజంగా హాకీ ప్లేయర్స్ ఎలా ఉంటారో అలాగే చేసాం.

* ఈ సినిమాలో గ్లామరస్ సాంగ్స్ చేసినట్లున్నారు?
అవును. అక్కడక్కడా సాంగ్స్ లో గ్లామర్‌ యాక్ట్స్ చేసినప్పటికి సినిమా పై ప్రభావం పడకుండా చూసుకున్నాం. అలాగే ఈ సినిమాలో నేను పెద్దగా మేకప్ వేసుకోలేదు.

*ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు?
ఈ సినిమాలో కూడా స్పోర్ట్స్ రాజకీయం చూపించాం. అన్ని క్రీడలలో ఉన్నట్లే హాకీలో కూడా రాజకీయాలు ఎలా ఉంటాయనేది చూపించడానికి ట్రై చేసాం. పాలిటిక్స్ ఆటకు శత్రువులుగా మారతాయి. అందుకే చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ కెరీర్ లాస్ అవుతుంటారు. అవన్నీ ఇందులో చూపించాం.

* హాకీ ప్లేయర్ పాత్రకోసం శారీరకంగా కష్టపడ్డారా..?
ఈ మధ్య అన్ని సేమ్ క్యారెక్టర్స్ వస్తున్నాయనే ఎక్కువగా సినిమాలను ఓకే చేయలేదు. అలా వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్లిపోయేలా కాకుండా ఈ సినిమాలో నా రోల్ కోసం హాకీ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో చెమటలు చిందించాను. అలా చేస్తేనే నాకు హ్యాపీగా ఉంది.

* సందీప్‌ కిషన్‌ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
సందీప్‌ నాకు ముందునుండే తెలుసు. ఇంతకుముందు ఇద్దరం ‘మాయావన్‌’ అనే సినిమాలో కలిసి పనిచేసాం. అలాగే ఈ సినిమా నిర్మాతల్లో సందీప్‌ కూడా ఒకరు. అందుకే ఎలాంటి విషయమైనా అతనితోనే చర్చించేదాన్ని. సందీప్ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అద్భుతమైన కోస్టార్ తను. ‘మాయవన్‌’లో మా మధ్య లవ్‌ ట్రాక్‌ ఉండదు. కానీ ఆ లోటు ఇందులో పూడ్చేసాం(నవ్వుతూ).

* ఈ సినిమాకు దాదాపు టెక్నీషియన్స్ డైరెక్టర్ అంతా కొత్తవాళ్లే కదా.. ఎలా ఉండేది సెట్లో వాతావరణం?

అవును. ఈ సినిమాలో చాలావరకు కొత్తవాళ్లే కనిపిస్తారు. డైరెక్టర్‌ డెన్నిస్‌ జీవన్‌ చాలా సరదా మనిషి.  ప్రతీ షాట్‌ డిస్కస్ చేసేవాడు. తమిళంలో హీరోయిన్ క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ చాలాబాగా తీర్చిదిద్దారు. ఇంకా సినిమాటోగ్రాఫర్‌ కెవిన్‌ నా బ్రదర్ లాగే.. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మ్యూజిక్ హిప్‌హాప్‌ తమిళ ఇచ్చాడు. బిజీఎం ఓ రేంజిలో ఇచ్చాడని మా టీమ్ చెబుతోంది.

* మరి మీరు సినిమా చూసారా..?
ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే ఈ సినిమాను థియేటర్లో చూడాలనే బలంగా ఫిక్స్ అయ్యాను. అంతేగాక సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.

* ఓటిటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా..?
ఓటీటీ ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నా. ఓ స్క్రిప్ట్ విన్నాను. చాలాబాగా నచ్చింది. కానీ ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సినిమాల పైనే. విలన్‌ పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధమే.

థాంక్యూ లావణ్య.. మీకు తుపాకీ టీమ్ తరపున ఆల్ ది బెస్ట్!
Tags:    

Similar News