ఒకచోట ఫ్లాపైతే ఇంకోచోట అవకాశం వెతుక్కునే ఛాయిస్ అందాల కథానాయికలకు ఉంది. సౌత్ నాలుగు భాషల్లో అవకాశాలు ఓ వరం అనే చెప్పాలి. తెలుగులో ఫ్లాపైతే కోలీవుడ్ శాండల్‌వుడ్ మలయాళ పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాయి. అక్కడ ఫ్లాపైతే తిరిగి టాలీవుడ్ లో ఏదైనా అవకాశం రావొచ్చు. ఆ కోవలోనే ఇటీవల పలువురు ఫేడవుట్ భామలు కంబ్యాక్ అయ్యే ప్రయత్నం తెలిసినదే.
అందాల కథానాయిక రాశీ ఖన్నాకు ఇటీవల టాలీవుడ్ లో డిజాస్టర్లు ఎదురవ్వడంతో కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఏకంగా బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు సంతకాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాశీ హైదరాబాద్ లో సెటిలైన బ్యూటీ.. కానీ చెన్నయ్ పరిశ్రమలో చక్రం తిప్పుతోంది. అక్కడ ఆడినంత కాలం ఆడి అటుపై తిరిగి టాలీవుడ్ కి వచ్చేస్తుంది.
ఇప్పడు అందాల లావణ్య కూడా రాశీ ఖన్నానే ఫాలో అవుతుందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. తొలి పరిచయం అందాల రాక్షసి గా తెలుగు యువత మనసు దోచిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత `సోగ్గాడే చిన్నినాయనా`.. `భలే భలే మగాడివోయ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కానీ ఇటీవల రిలీజైన ఓ రెండు సినిమాలు ఫ్లాపులుగా నిలిచి తీవ్రంగా నిరాశపరిచాయి. సందీప్ సరసన నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్.. కార్తికేయ సరసన నటించిన చావు కబురు చల్లగా డిజాస్టర్లు అవ్వడంతో ఇప్పుడు కెరీర్ పరంగా డైలమా నెలకొంది. హిట్టును నమ్మే పరిశ్రమలో వరుసగా ఫ్లాపులొస్తే వెంటనే అవకాశాలు రావడం కష్టం. అందుకే ఇప్పుడు రాశీ ఖన్నా తరహాలోనే లావణ్య కోలీవుడ్ బాట పడుతుందని భావిస్తున్నారు.
రాశీ అటు తమిళంతో పాటు ఇరుగు పొరుగు పరిశ్రమల్లో అవకాశాలు అందుకుంటోంది. రాశీ బాటలోనే హైదరాబాద్ లో స్థిరపడిన లావణ్య కూడా పొరుగున ప్రయత్నించేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. వరుస ఫ్లాపులతో లావణ్య కెరీర్ ముగిసిపోయింది! అంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నా కానీ అది నిజం కాదు. టాలీవుడ్ లో కుదరకపోతే మరో మూడు నాలుగు పరిశ్రమలు అవకాశాలిస్తున్నాయి. అయినా మూడు ముక్కలాటలో మన భామలు ఆరితేరిపోయారు. ప్రస్తుతానికి ముక్కలాటకు లావణ్యం సిద్ధమవుతుందేమో వేచి చూడాలి.