హీరోయిన్ అంటే.. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్! ఖరీదైన కారుల్లో ప్రయాణం.. పబ్బులు, క్లబ్బుల్లో జల్సాలు.. హబ్బో అదంతా ఓ లెవల్ అనుకుంటారు చాలా మంది. ఓ యాంగిల్ లో అది నిజమే కూడా. కానీ.. అందరూ అదేవిధంగా ఉండరు. కాంక్రీట్ జంగల్ లోనే అందరూ ఆనందాన్ని కొనుక్కోరు.. కొందరు ప్రకృతిలో సంతోషాన్ని వెతుక్కుంటారు.
అలాంటి అందమైన భామల్లో ఒకరు లావణ్య త్రిపాఠి. అందమైన నగుమోముతో మెరిసిపోయే సోయగాల లావణ్యం.. తన ఆనందాలు కూడా అలగ్ అంటోంది. రెస్టారెంట్లు, రిసార్టుల్లో రిలాక్స్ అయ్యే బ్యాచ్ తాను కాదంటోంది. ప్రకృతి నడుమ, కొండలు గుట్టలపై ప్రశాంతతను ఆస్వాదిస్తానని చెబుతోంది.
మరి, ఇలాంటివి నగరాల్లో ఉండవు కదా.. అందుకే, జనావాసాలకు దూరంగా కొండ ప్రాంతాల్లో కొంత భూమి కొనుక్కుంది. ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ మునిసిపాలిటీ పరిధిలో ఉన్న చమసారి అనే గ్రామ సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. అక్కడ ఇల్లు కాకుండా.. ఓ కేఫ్ లాంటిది నిర్మించాలని చూస్తోందట.
అవసరమైతే ఉండడానికి పనికొచ్చే విధంగా ఓ కేఫ్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే.. ఇదేదో బిజినెస్ ప్లాన్ కాదు.. కేవలం తన కుటుంబ సభ్యులు, తమవాళ్ల కోసమేనట. ఎప్పుడైనా వర్క్ లోడ్ తో సతమతమైనప్పుడు.. లేదంటే రిలాక్సేషన్ కోరుకున్నప్పుడు.. ఈ ప్రాంతానికి వచ్చేస్తే సరి, వెంటనే రిచార్జ్ అయిపోవొచ్చు అంటోంది లావణ్య. ప్రకృతి ప్రేమికులకు ఇంతకన్నా అద్భుతమైన విశ్రాంతి మరేం ఉంటుంది చెప్పండి.