గ్లో పెంచేస్తున్న అందాల రాక్ష‌సి.. ఇలా అయితే

Update: 2021-04-27 18:30 GMT
అందాల రాక్ష‌సి చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన లావ‌ణ్య త్రిపాఠి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నా.. ఆ త‌ర్వాత ఎందుక‌నో ఆశించినంత పెద్ద స్థాయికి ఎద‌గ‌డంలో త‌డ‌బ‌డింది. కింగ్ నాగార్జున లాంటి పెద్ద స్టార్ అవ‌కాశం క‌ల్పించినా ఆ త‌ర్వాత ఇత‌ర పెద్ద హీరోలెవ‌రూ ఎందుక‌నో త‌న‌కు అవ‌కాశాలివ్వ‌లేదు.

ముఖ్యంగా ఈ అమ్మ‌డికి మెగా కాంపౌండ్ లో అగ్ర హీరోల నుంచి ఆఫ‌ర్లు రాలేదు. అల్లు శిరీష్‌- సాయి తేజ్- వ‌రుణ్ తేజ్ లాంటి స్టార్లు అవ‌కాశాలు క‌ల్పించిన త‌ర్వాత బ‌న్ని లాంటి పెద్ద హీరో స‌ర‌స‌న న‌టించాల‌ని ఆశ‌ప‌డినా ఆ అవ‌కాశం త‌న త‌లుపు తట్ట‌లేదు. కార‌ణం ఏదైనా లావ‌ణ్య కేవ‌లం ఒక సెక్ష‌న్ హీరోల వ‌ర‌కే ప‌రిమిత‌మైపోయింది.

ఇటీవ‌ల సందీప్ కిషన్ తో ఏ1 ఎక్స్ ప్రెస్ .. కార్తికేయ‌తో గీతా ఆర్ట్స్ 2 లో న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమాల రిజ‌ల్ట్ త‌నను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈ రెండిటిపైనా ఎక్కువ అంచ‌నాలు పెట్టుకున్నా ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల‌య్యాయి. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఖాళీ. ఇక‌పై ఇరుగుపొరుగు భాష‌ల‌పైనా దృష్టి సారించాల‌ని లావ‌ణ్య భావిస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలోనే వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. లావణ్య తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి దూసుకొచ్చింది. ``కొంద‌రు ఎదుగుతారు.. నేను గ్లో అవుతాను!`` అంటూ లావ‌ణ్య ఇచ్చిన క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. మిరుమిట్లు గొలిపే డిజైన‌ర్ ఫ్రాకులో లావ‌ణ్య గ్లో యూత్ కి ఒక రేంజులోనే క‌నెక్ట‌వుతోంది.
Tags:    

Similar News