కెరీర్ లో ఆ ఒక్క హిట్టు కోస‌మే ఇంత క‌సిగా

Update: 2021-04-30 07:30 GMT
కెరీర్ లో ఆశించిన స్టార్ డ‌మ్ అందుకోవ‌డంలో అందాల రాక్ష‌సి లావ‌ణ్య త‌డ‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. వెంట‌నే ఏదీ ద‌క్క‌క‌పోయినా నిరాశ అన్న‌ది ద‌రి చేర‌నివ్వ‌క వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ త‌నదైన ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. కానీ ఇంకా ఆ ల‌క్ ఏదో త‌న‌కు క‌లిసి  రావ‌డం లేదు.

ఇటీవ‌లే ఈ బ్యూటీ న‌టించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ‌య్యాయి. చావు క‌బురు చ‌ల్ల‌గా.. ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రాలు త‌నకు కెరీర్ ప‌రంగా మైలేజ్ పెంచుతాయ‌ని ఆశించింది. కానీ తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా ఈ డెహ్రాడూన్ బ్యూటీ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ లుగా నిలిచాయి.

ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా గ్లో అన్న‌దే లేదు. మ‌రో కొత్త క‌మిట్ మెంట్ కి సంబంధించిన అప్ డేట్ ఏదీ లేదు. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఇత‌ర నాయిక‌ల‌తో పోటీప‌డే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఏ గోల్డెన్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటూ లావ‌ణ్య స‌రికొత్త లుక్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. లావ‌ణ్య‌కు ఒక సెక్ష‌న్ హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్ల‌కు కొద‌వేమీ లేదు ఇంత‌కాలం. ఇక‌పైనా అలాంటి అవ‌కాశాలే త‌న‌ని ఆదుకోవాల్సి ఉంటుంది. ఆ క్ర‌మంలోనే ఇరుగు పొరుగునా ఈ బ్యూటీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని తెలుస్తోంది. మ‌రోసారి ఒకే ఒక్క హిట్టు త‌న ద‌శ‌ను మార్చేసేది ద‌క్కుతుంద‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News