అందాల రాక్షసి.. స్మైల్ తోనే చంపేస్తోందిగా..

Update: 2022-07-24 14:30 GMT
కొంతమంది హీరోయిన్స్ అందం అభినయంలో చాలా మంచి గుర్తింపును అందుకున్నప్పటికీ కూడా వారి బ్యాడ్ లక్ కారణంగా ఊహించని అపజయాలు ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా వారు సెలక్ట్ చేసుకుంటున్న కథలలో కూడా కొంత లోపం ఉంటుంది అనే చెప్పాలి. కానీ ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయితే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు.

ఇక ఈ క్రమంలో ఎప్పటినుంచో నటనతోనే కాకుండా అందం విషయంలో కూడా ఎంతగానో కట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి కూడా అదే తరహా బ్యాడ్ లక్ ను ఎదుర్కొంటుంది. ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో పెద్దగా హద్దులు దాటకపోయినప్పటికీ కూడా ప్రతి ఫోటోషూట్ లో ఏదో ఒక గ్లామర్ ట్రీట్ అయితే ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోతో తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.

రీసెంట్గా అమ్మడు చిన్న నిక్కర్ లో అలాగే టీ షర్ట్ లో కనిపించిన విధానం నెటిజన్స్ ను ఎంతగానో కట్టుకుంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆమె చిరునవ్వు కుర్రాళ్లను మరింతగా టెంప్ట్ చేస్తోంది. అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత కొంతమంది మీడియం రేంజ్ హీరోలతో కూడా నటించింది. అయితే ఊహించని విధంగా కొన్ని పరాజయల వలన ఆమె మార్కెట్ వాల్యూ తగ్గిపోయింది.

ఇక రీసెంట్ గా వచ్చిన హ్యాపీ బర్త్డే సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి రేంజ్ మరింత తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా లావణ్య త్రిపాఠి ఏ మాత్రం నీరుత్సాహ పడకుండా ఎప్పటిలానే మంచి నటిగా కొనసాగాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కూడా ఆమెకు కొన్ని చిన్న సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయట. అయితే అందులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని ఈ బ్యూటీ ఆలోచిస్తోంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులలో నటించడానికి చర్చలు అయితే జరుపుతోంది. మరి లావణ్య త్రిపాఠి రాబోయే రోజుల్లో ఎంతవరకు ట్రాక్ లోకి వస్తుందో చూడాలి.
Tags:    

Similar News