ఫొటోటాక్‌ : మతి పోగొట్టేంతటి లావణ్యమైన అందం

Update: 2020-11-09 18:20 GMT
ఏ ముహూర్తాన అందాల రాక్షసి అనే సినిమాను చేసిందో కాని లావణ్య త్రిపాఠి అప్పటి నుండి ఇప్పటి వరకు అందాల రాక్షసిగానే పిలవబడుతుంది. నిజానికి కూడా ఆమె అందం చూస్తే ఆ పేరు ఆమెకు పర్ఫెక్ట్‌ అనిపిస్తుంది. నిజంగా ఆమెను చూడగానే బాబోయ్‌ ఈమె అందాల రాక్షసి అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తూ ఉంటారు. అందాల రాక్షసి పేరును కాపీ రైట్‌ తీసుకున్నట్లుగా ఉండే లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా మెల్ల మెల్లగా కెరీర్‌ లో ముందుకు వెళ్తుంది. సక్సెస్‌ లు వచ్చినా రాకున్నా కూడా తన అందంతో ఆఫర్లు దక్కించుకుంటూ వస్తున్న లావణ్య త్రిపాఠి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసే ఫొటోలు ఫాలోవర్స్‌ మతి పోగొడుతూనే ఉన్నాయి.

సోషల్‌ మీడియా ద్వారా లావణ్య త్రిపాఠి షేర్‌ చేసిన ఈ ఫొటోకు మరోసారి అభిమానులు అందాల రాక్షసి ఆ చూపుతోనే చంపేస్తుంది.. ఆ థైస్‌ బ్యూటీతో మతి పోగొడుతోంది అంటూ స్వీట్‌ గా తిడుతున్నారు. ప్రస్తుతం ఈమె సందీప్‌ కిషన్‌ తో కలిసి ఎ1 ఎక్స్‌ ప్రెస్‌ మరియు చావు కబురు చల్లగా సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత అయినా ఈ అందాల రాక్షసికి స్టార్‌ హీరోల నుండి పిలుపు వస్తుందేమో చూడాలి. లావణ్య త్రిపాఠి వెబ్‌ సిరీస్‌ లతో కూడా త్వరలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆమెను వెబ్‌ సిరీస్‌ ల కోసం ఫిల్మ్‌ మేకర్స్‌ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Tags:    

Similar News