లవ్లీ స్మైలింగ్ లుక్కుతో ఆకట్టుకుంటున్న అందాల రాక్షసి!!

Update: 2020-12-26 02:30 GMT
2012లో తెలుగు కుర్రకారుతో 'ఏ మంత్రమో అల్లేసిందిలా.. ఎదకే వేసే సంకెల' అంటూ పాట పాడించిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీ. ఫస్ట్ సినిమాతోనే క్యూట్ క్యూట్ అభినయంతో ఆకట్టుకున్న ఈ డెహ్రాడూన్ భామ.. తెలుగు ఇండస్ట్రీకి మరో తెలుగమ్మాయి లాంటి అందం దొరికిందనే ఫీల్ కలిగించింది. అనుకున్నట్టుగానే భలే భలే మగాడివోయ్.. శ్రీరస్తు శుభమస్తు.. సోగ్గాడే చిన్ని నాయనా.. హిట్లతో అభినయానికి అవకాశమున్న పాత్రలనే చేసుకుంటూ వచ్చింది లావణ్య. కానీ తన అదృష్టం కొంతకాలమే నిలవడంతో అమ్మడికి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. లావణ్య కెరీర్ ముగిసిందేమో అనుకునేలా చేసింది.

కానీ కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ 'అర్జున్ సురవరం' సక్సెస్ తో ట్రాక్‌ ఎక్కింది. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా లావణ్య ఒక్కసారి కూడా టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరలేకపోయింది. ఇక తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు అందాల విందు వడ్డీస్తోంది. ప్రస్తుతం లావణ్య యువ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే తమిళంలో 'వాల్మీకి' ఫేమ్ అధర్వ మురళీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా'లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా లావణ్య పోస్ట్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సింపుల్ గా లవ్లీ స్మైలింగ్ లుక్కుతో పింక్ డ్రెస్సులో బుట్టబొమ్మలా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమ్మడిని చూస్తూ నెటిజన్లు అందమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Tags:    

Similar News