గ్లామర్ యాంగిల్ దించుతున్న రాక్షసి

Update: 2017-02-03 09:10 GMT
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి తెలుగులో వరుసగా సినిమాలు చేసేస్తోంది. అయితే.. అరంగేట్రం నుంచి ఇప్పటివరకూ అన్నీ హోమ్లీ కేరక్టర్స్ మాత్రమే చేసింది ఈ అందాల రాక్షసి. మనం.. భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయన.. లచ్చిందేవికి ఓ లెక్కుంది.. శ్రీరస్తు.. శుభమస్తు.. ఇలా వరుసగా పక్కింటమ్మాయి పాత్రల్లో మాత్రమే కనిపించింది.

కెరీర్ ఇలాగే కంటిన్యూ చేస్తే.. ఇక తనను ఇలాంటి పాత్రలకే పరిమితం చేస్తారని.. గ్లామర్ రోల్స్ కు భారీ చిత్రాలకు తీసుకోరనే బెంగ లావణ్యకు మొదలైపోయిందట. అందుకే ఇక నుంచి తన గ్లామర్ యాంగిల్ ను బయటకు తీయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ కి జోడీగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ మూవీలో నటిస్తుండగా.. శర్వానంద్ లేటెస్ట్ మూవీలోను యాక్ట్ చేయనుంది లావణ్య త్రిపాఠి. వీటితో పాటు మాస్ మహరాజ్ 15 నెలల గ్యాప్ తర్వాత మొదలుపెడుతున్న టచ్ చేసి చూడు చిత్రంలో కూడా లావణ్య త్రిపాఠినే హీరోయిన్.

ఈ మూడు సినిమాల్లోనూ గ్లామర్ మోత మోగించేయనుందిట. వరుణ్ తేజ్.. శర్వానంద్ సినిమాలు రొమాంటిక్ జోనర్ లోవి కావడంతో.. అమ్మడికి గ్లామర్ ని చూపించే స్కోప్ చాలా ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకూ చూసిన లావణ్యకు.. ఇకపై రాబోయే సినిమాల్లో కనిపంచే గ్లామర్ లావణ్యకు చాలా తేడా ఉండనుందని ఇండస్ట్రీ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News