చిన్న‌ప్పుడే బికినీ వేసింద‌ట‌!

Update: 2015-07-26 05:43 GMT
నాన్నా నాకు తొంద‌ర‌గా  పెళ్లి చేసేయండి నాన్నా... అంటూ బుంగ‌మూతి పెట్టుకొని అడిగిన రాక్ష‌సి గుర్తుంది క‌దూ! అదేనండీ... `అందాల రాక్ష‌సి` హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి. ఆ సినిమాలో ఎంత అందంగా క‌నిపించింద‌నీ, ఎంత అల్ల‌రి చేసింద‌నీ!  ఆ సినిమా చూసిన‌ప్ప‌ట్నుంచి లావ‌ణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందాల రాక్ష‌సి గానే గుర్తుండిపోయింద‌న్న‌మాట‌. తొలి నుంచీ ప‌ద్ధ‌తైన పాత్ర‌ల్లోనే మెరిసింది. కానీ ఇప్పుడంటే ఇలా ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తోంది కానీ... గ్లామ‌ర్ విష‌యంలో ఈమెకి భాషా లెవె ల్లో ఫ్లాష్‌ బ్యాక్ ఉన్న‌ట్టుంది.

బికినీ గురించి అడిగితే... అమ్మ‌డు చిన్న‌ప్పుడే వేసేశా అని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. సొట్ట‌బుగ్గ‌ల‌తో అమాయ‌కంగా క‌నిపించే లావ‌ణ్య టీనేజ్‌ లోనే బికినీ వేసి కుర్ర‌కారును వేడెక్కించిందంటే ఎవ‌రైనా న‌మ్ముతారా! కానీ ఇది నిజం. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్వూ లో లావ‌ణ్య త‌న బికినీ అందం గురించి బ‌య‌ట‌పెట్టింది. మ‌రి ఇప్పుడు బికినీ వేయ‌మంటే ఓకేనా? అంటే... ఇప్పుడంటే నా ఒంటికి బికినీ న‌ప్పుతుందో లేదో  చూడాలి మ‌రి అని సెల‌విచ్చింది. పెద్ద‌య్యేకొద్దీ శరీరంలో మార్పులొస్తాయి క‌దా అందుకే లావ‌ణ్య బికినీ న‌ప్పుతుందో లేదో అని సందేహం వ్య‌క్తం చేసింద‌న్న‌మాట‌.

 అన్న‌ట్టు ఈ భామ ప‌దిహేడేళ్ల వ‌య‌సులోనే సీరియ‌ళ్ల‌ లో న‌టించింద‌ట‌. ప‌లు యాడ్స్‌ లోనూ మెరిసింది. దీంతో వెండితెర ప్ర‌వేశం సుల‌భంగా జ‌రిగిపోయింది. అయితే హీరోయిన్లంతా తమ‌తోపాటు త‌ల్లినో, తండ్రినో వెంట తెచ్చుకొంటుంటారు. కానీ లావ‌ణ్య మాత్రం ఒక్క‌టే ఉంటుంద‌ట‌. ``త‌ల్లిదండ్రుల్ని తెచ్చుకొంటే వాళ్ల కంఫ‌ర్ట్ గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ఇక నేనెక్క‌డ షూటింగ్‌ చేస్తాను? అందుకే నేనొక్క‌టే షూటింగుల‌కి వ‌స్తుంటాను. చిన్న‌ప్ప‌ట్నుంచే సినిమా వాతావ‌ర‌ణం అల‌వాటైంది కాబ‌ట్టి ఏ విష‌యాన్నైనా ఒక్క‌దాన్నే మేనేజ్  చేసుకొంటా`` అని చెప్పుకొచ్చింది లావ‌ణ్య‌.
Tags:    

Similar News