మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ రాఘవ లారెన్స్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుల్లో లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్‌గా సౌత్ సినిమాలో ఎంతో ఫేమస్. సక్సెస్ ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా.. నటుడిగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం కొరియోగ్రఫీకి దూరంగా ఉంటూ దర్శకుడిగా..నటుడిగా కొనసాగుతున్నారు.
ఆయన హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. చివరిగా `కాంచన-3`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత కోవిడ్ ప్రారంభంతో లారెన్స్ మ్యాకప్ కి దూరమయ్యారు. ఈ క్రమంలోనే కొత్త చిత్రాలు లాక్ చేసారు. ప్రస్తుతం ఆయన హీరోగా కోలీవుడ్ లో నాలుగైదు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో మూడు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.
అందులో ఒకటి బ్లాక్ బస్టర్ `చంద్రముఖి`కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న `చంద్రముఖి-2`. మొదటి భాగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించగా...రెండవ భాగంలో ఆ బాధ్యతలు లారెన్స్ తీసుకున్నారు. చంద్రముఖిని తెరకెక్కించిన పి.వాసునే ఈ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శర వేగంగా జరుగుతోంది.
లారెన్స్...రాధిక..వడివేలు పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ ఇంటి సెట్లో ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఆద్యందం వినోద భరితంగా సాగే సన్నివేశాలని సమాచారం. అయితే ఇందులో చంద్రముఖి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. చందమామ కాజల్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది గానీ...యూనిట్ ఇంకా కన్పమ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడో బలమైన సందేహం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకూ ఆ రోల్ కి ఎవర్నీ ఎంపిక చేయలేదంటే? చంద్రముఖి పాత్రని సైతం లారెన్స్ పోషిస్తున్నాడా? అన్న కొత్త సందేహం తెరపైకి వస్తుంది. గతంలో ఇలాంటి రోల్స్ పోషించిన అనుభవం లారెన్స్ కి ఉంది. `ముని` సీక్వెల్స్ లో లారెన్స్ ఆత్మ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు.
దెయ్యం పాత్ర పెర్పార్మెన్స్ లో ఇరగదీసాడు. ఈ నేపథ్యంలో చంద్రముఖిగా వాసు అతన్ని ఎంపిక చేసుకున్నా? ఆశ్చర్యపోనవసరం లేదు. చంద్రముఖిగా.. శాస్ర్తజ్ఞుడిగా లారెన్స్ అభినయించినా ప్రేక్షకులకు సమ్మతమే. అదే నిజమైతే ఆడియన్స్ కిది పెద్ద సర్ ప్రైజ్ అవుతుంది. ఇదే జోనర్లో లారెన్స్ స్వీయా దర్శకత్వంలోనూ కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. హారర్ చిత్రాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. మార్కెట్ పరంగా ఇమేజ్ రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో `చంద్రముఖి-2` ప్రేక్షకుల్లో మరింత ఆసక్తికరంగా మారుతోంది.