శ్రీరెడ్డి..అప్పుడు దెయ్యం, ఇప్పుడు దేవుడు ఎలా?

Update: 2018-10-16 07:20 GMT
పలువురు తెలుగు సెలబ్రెటీల పై కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో బిజీ నటిగా మారిపోయింది. తెలుగు సినిమా ప్రముఖులపై మాత్రమే కాకుండా మురుగదాస్‌ - లారెన్స్‌ వంటి తమిళ సెలబ్రెటీలపై కూడా ఈమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి నోరు మూయించేందుకే తమిళ సినిమా పరిశ్రమలో ఈమెకు అవకాశాలు వస్తున్నాయనే టాక్‌ కూడా సోషల్‌ మీడియాలో జరుగుతుంది. ఈ సమయంలోనే మరో ఆసక్తికర పరిణామం జరిగింది.

మొన్నటి వరకు లారెన్స్‌ పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా ఆయన ఇంటికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఫేస్‌ బుక్‌ లో శ్రీరెడ్డి.. నా ప్రియ మిత్రులకు గుడ్‌ న్యూస్‌, నేను ఈరోజు లారెన్స్‌ గారిని ఆయన ఇంట్లో కలిశాను. ఆయన నన్ను చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. అక్కడ చాలా మంది చిన్న పిల్లలున్నారు. వారంతా కూడా నాకోసం - నాబాగు కోసం ప్రార్థన చేస్తామన్నారు. లారెన్స్‌ గారి ఒక సినిమా కోసం నేను ఆడిషన్స్‌ ఇచ్చాను. ఆడిషన్స్‌ లో సెలక్ట్‌ అవ్వడం, సినిమాలో ఛాన్స్‌ దక్కడంతో పాటు, అడ్వాన్స్‌ ను కూడా తీసుకోవడం జరిగిపోయిందంటూ సంతోషంగా పేర్కొంది. తనకు వచ్చిన అడ్వాన్స్‌ అమౌంట్‌ ను తిత్లీ తుఫాన్‌ బాధితుల సహాయార్థం వినియోగించనున్నట్లుగా ఆమె పేర్కొంది.

శ్రీరెడ్డి కి ఒక్కసారిగా లారెన్స్‌ నుండి పిలుపు రావడం, సినిమాలో ఛాన్స్‌ దక్కడం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు దెయ్యం అంటూ లారెన్స్‌ ను తిట్టావు, మంచి మసుగు వేసుకున్న వ్యక్తి అంటూ లారెన్స్‌ పై ఆరోపణలు చేశావు, ఇప్పుడు ఆయన పిలవగానే ఎలా వెళ్లావు, ఇప్పుడు ఆయన నీకు ఎలా దేవుడు అయ్యాడు అంటూ ఒక నెటిజన్‌ శ్రీరెడ్డిని ప్రశ్నించాడు. ఇంకా పలువురు పలు రకాలుగా శ్రీరెడ్డి తాజా పోస్ట్‌ పై స్పందిస్తున్నారు.
Tags:    

Similar News