మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అన్న విషయాన్ని రుజువు చేశారో టాలీవుడ్ నిర్మాత ఒకరు. తనను నమ్మిన దర్శకుడికి ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదన్న సూత్రాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి చూపించిన వైనం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత దర్శకులు అంటే సినిమాకు రెండు చక్కాలు లాంటి వారు. ఒకరు తక్కువా కాదు.. మరొకరు ఎక్కువా కాదు. ఎంత క్రేజీ ప్రాజెక్టు అయినా అందుకు సరిపడా ఫైనాన్స్ తేలేకపోతే ప్రయోజనం ఉండదు.
అలానే ఎంత ఫైనాన్స్ ఏర్పాటు చేసినా.. సరైన సరుకు లేని దర్శకుడి వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే.. దర్శక నిర్మాతల మధ్య బంధం బలీయంగా ఉంటే అది సదరు సినిమాకు ప్లస్ అవుతుంది. ఒక సీనియర్ దర్శకుడికి ఒక నిర్మాత చూపించిన ‘రియల్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మన అనుకున్న వారిని దెబ్బేయటం ఎంత ఈజీనో సదరు దర్శకుడికి.. ఆ నిర్మాత బాగా అర్థమయ్యేలా చేశాడన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో అతను ఒకరు. ఒకానొక టైంలో ఇండ్ట్రసీకి పెద్ద హిట్ ఇచ్చిన టాలెంట్ అతని సొంతం. అలాంటి దర్శకుడు ఒకరు తాను పని చేసిన నిర్మాత విషయంలో చేదు అనుభవం ఎదురైంది.
సదరు నిర్మాత గతంలో ఒక ల్యాండ్ ను చూపించి కొనుక్కోమంటే కొనుక్కున్నాడు. తాజాగా ఆ భూమిని అమ్మేయాలని భావించాడు. వేరే వారితో చెబితే కమిషన్ గట్రా ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతో.. తన చేత కొనిపించిన సదరు నిర్మాతకు భూమిని అమ్మి పెట్టాలన్న బాధ్యతను అప్పజెప్పాడు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. సదరు నిర్మాత ఇప్పుడా దర్శకుడితో సినిమా కూడా చేస్తున్నారు. అందుకు ఓకే చెప్పిన సదరు నిర్మాత.. దర్శకుడి భూమిని అమ్మేశాడు. అందరూ హ్యాపీస్ అనుకునే వేళ.. అనుకోని విషయం ఒకటి బయటకు వచ్చింది.
సదరు దర్శకుడి ల్యాండ్ ను అమ్మే విషయంలో.. సదరు నిర్మాత రెగ్యులర్ గా తాను తీసుకునే కమిషన్ ను తీసుకున్న విషయాన్ని సదరు దర్శకుడికి సమాచారం అందటంతో అతగాడు షాక్ తిన్నాడు. ఇంత పరిచయం ఉన్న సదరు నిర్మాత ఆ రకంగా తన డీల్ ను కమర్షియల్ చేసి.. కమిషన్ దండుకున్న తీరుకు అవాక్కు అయినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది.