నిండా మునిగిన అగ్ర నిర్మాత

Update: 2016-11-24 11:36 GMT
పెద్ద నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన రంగాల్లో సినిమా ఫీల్డు ముందు వరసలో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో సినిమాల్లోకి భారీగా బ్లాక్ మనీ వస్తూ పోతూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చేతిలో పైసా లేకున్నా ఇక్కడ చాలామంది నిర్మాతలు అయ్యేది.. భారీ సినిమాలు చేసేది.. ఇలా వచ్చి పడే డబ్బులతోనే. ప్రధానంగా ఫైనాన్షియర్లను నమ్ముకుని ఇక్కడ చాలామంది సినిమాలు తీసేస్తుంటారు. తెలుగులో ఓ ప్రముఖ నిర్మాత ఇలా డబ్బులు రొటేట్ చేస్తూ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. ఆయన ఓ వైపు పెద్ద సినిమాలతో పాటు.. మరోవైపు చిన్న సినిమాలూ చేస్తుంటాడు.

ఐతే పెద్ద నోట్ల రద్దుతో ఆయనకు ఒక్కసారిగా ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ఆయన ప్రొడక్షన్లో ప్రస్తుతం మూణ్నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉండగా 500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం వెలువడింది. ఐతే ఇప్పుడు ఆయన తన దగ్గర భారీగా ఉన్న పాత నోట్లను మార్చుకోలేకపోతున్నారు. కొత్త నోట్లను తేలేకపోతున్నారు. దీంతో ఆయన సినిమాల పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ నిర్మాతకు డబ్బులిచ్చిన ఫైనాన్షియర్లు ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆయనకున్న పేరు ప్రతిష్టల వల్ల ఓపిగ్గానే ఉంటున్నారు కానీ.. ఈ ఓపిక ఎన్ని రోజులుంటుందో తెలియదు. వాళ్లెవరూ పాత నోట్లిస్తే తీసుకోవడం లేదు. ఎప్పుడూ చేతిలో డబ్బులుంచుకుని లావాదేవీలు చేసే అలవాటు వల్ల బుక్కయిపోయాడు ఆ నిర్మాత. మున్ముందు ఆయనకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చని అంటున్నారు. చూద్దాం ఈ సంక్షోభం నుంచి ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎలా బయటపడతాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News