లీకులిచ్చినోడి నేల‌కేసి కొట్ట‌క‌పోయి ఉంటే?

Update: 2019-09-05 01:30 GMT
వంద‌ల కోట్ల బ‌డ్జెట్ ల‌తో సినిమాలు తీసే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల టెన్ష‌న్ ఎలా ఉంటుందో విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. టెన్ష‌న్ టెన్ష‌న్ గా ఉంటుంది. ఆన్ లొకేషన్ నుంచి ఇప్పుడున్న విచ్చ‌ల‌విడి సామాజిక మాధ్య‌మాల్లో ఎప్పుడు ఏది లీకైపోతుందో అన్న టెన్ష‌న్ నిరంత‌రం వెంటాడుతూ ఉంటుంది. గుట్టును ఎంత దాచాల‌ని ప్ర‌య‌త్నిస్తే అంత‌గా ఓపెన్ చేసేస్తున్నారు ఆకతాయిలు. అలా ఇప్ప‌టికే టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలకు సంబంధించి లీకేజీలు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేశాయి. అటు కోలీవుడ్ లోనూ ర‌జ‌నీకాంత్- విజ‌య్- క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ల‌కు ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు.

అయితే ఇలాంటి లీకేజీల‌కు ఎలాంటి ఆస్కారం ఇవ్వ‌కుండా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే జ‌క్క‌న్న‌కే తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న క్రేజీ చిత్రం ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి ఏదో ఒక లీకేజీ బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి.  ఇదో దేశ‌భ‌క్తి నేప‌థ్యంలోని సినిమా. విప్ల‌వ వీరుల నేప‌థ్యంలోని ఫిక్ష‌న్ క‌థ‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాబ‌ట్టి అంద‌రిలో ఏదైనా తెలుసుకోవాల‌నే ఆత్రుత ఉంది.   ఆ క్ర‌మంలోనే ఆక‌తాయిల లీకేజీలు క‌ల‌వ‌ర‌ పెట్టాయి. ప్రారంభమే కోకాపేట‌ షూటింగ్ స‌మ‌యంలోనే లీకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. బ‌ల్గేరియా వెళ్లే ముందు కోకాపేట సెట్స్ లో కొన్ని సీన్లు చేశారు. ఆ టైమ్ లో ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి త‌న మొబైల్ లో కొన్ని ఫోటోలు తీశాడు. అవి రాజ‌మౌళి కొడుకు కార్తికేయ‌కు చిక్కాయి. కార్తికేయ‌కు చిక్క‌క ముందే ఒక‌టీ అరీ ఫోటోల్ని లీక్ చేయ‌డంతో  ఆర్.ఆర్‌.ఆర్ టీమ్ చాలా జాగ్ర‌త్త ప‌డింది. లీకేజీల‌పై టీమ్ స‌భ్యులు చాలా అప్సెట్ అయ్యారు.

ఒక‌వేళ మొత్తం ఫోటోలు లీక్ చేసి ఉంటే అనే టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అయితే కార్తికేయ అత‌డి నుంచి ఫోన్ లాక్కుని దానిని నేల‌కేసి ప‌గ‌ల‌గొట్ట‌డంతో చాలానే డ్యామేజీని ఆప‌గ‌లిగారు. లీక‌యిన‌వి బ‌య‌ట‌కు వెళ్లి ఉంటే ఇంకేదో అయ్యేదేన‌ని ఆందోళ‌న‌కు గుర‌య్యార‌ని వార్త‌లొచ్చాయి. ఆ ఫోటోలు తీసిన కుర్రాడిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ వ‌దిలేశారు ఎందుక‌నో. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి అనుక్ష‌ణం టెన్ష‌న్ ప‌డుతూ మేక‌ర్స్ ఇంత చేస్తుంటే ఏదో స‌ర‌దా వేషం కోసం ఇలాంటి పిచ్చిప‌నులు చేస్తున్నారు చాలా మంది. అయితే ఇలాంటి ప‌నులు చేసే ముందు ఒక్క క్ష‌ణం ఆలోచిస్తే ఆ ప‌ని చేయ‌రేమో!!
Tags:    

Similar News