కూతురు పెళ్లి పనుల్లో లెజెండ్రీ డైరెక్టర్‌

Update: 2020-11-14 05:15 GMT
సౌత్‌ సినిమాల వైపు ఉత్తరాది వాళ్లు చూసిన గొప్ప దర్శకుల్లో ఒకరు శంకర్‌ అనడంలో సందేహం లేదు. ఆయన చేసిన ప్రతి భారీ సినిమా కూడా హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన చేసింది తమిళంలోనే అయినా అన్ని భాషల్లో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతాయి. లెజెండ్రీ డైరెక్టర్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడి గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో రెగ్యులర్‌ గా వార్తలు వస్తున్నాయి. ఇండియన్‌ 2 సినిమా విషయంలో ఈయన మూవ్‌ ఏంటీ అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో శంకర్‌ ఒక భారీ మల్టీస్టారర్‌ మూవీని ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినీ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం శంకర్‌ తన కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.

దర్శకుడు శంకర్‌ కు ముగ్గురు పిల్లలు. అదితి.. ఐశ్వర్య మరియు బాబు అర్జిత్‌. ప్రస్తుతం అదితి పెళ్లి పనుల్లో దర్శకుడు ఉన్నాడు. త్వరలో పెళ్లికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కారణంగా గత కొన్ని రోజులుగా శంకర్‌ సినిమా పనులకు దూరంగా ఉంటున్నారు. వచ్చే ఏడాది వరకు ఆయన సినిమాల విషయమై ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇండియన్‌ 2 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పునః ప్రారంభం అవ్వనుంది. ఇక ఆయన మల్టీ స్టారర్‌ కూడా త్వరలో చర్చల్లోకి వెళ్లబోతుంది. ఆయన కోరుకున్న హీరోలు లభిస్తారా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News