మలయాళ హీరో దుల్కార్ సల్మాన్ కథానాయకుడిగా తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `లెఫ్టినెంట్ రామ్` టైటిల్ తో అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా- వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మెజారిటీ భాగం హిమచల్ ప్రదేశ్ కశ్మీర్ పరిసరాల్లో సాగుతోంది. ఇది వార్ నేపథ్యంలో సాగే బ్యూటీఫుల్ లవ్ స్టోరీ అని సమాచారం. వాస్తవానికి టైటిల్ ప్రకటనతోనే ఇది వార్ నేపథ్యం ఉన్న సినిమా అని ఖరారైంది.
టైటిల్ పూర్తిగా డిఫెన్స్ ఫోర్సెస్ కి చెందినది కావడంతో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గానే భావించారు. అయితే ఇందులో తనదైన మార్క్ లవ్ స్టోరీని హనురాఘవపూడి ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీలకు ఈ యంగ్ డైరెక్టర్ పెట్టింది పేరు. లవ్ ట్రాక్ లను తెరపై ఎంతో ఆందంగా ఆవిష్కరించగలడు. కాబట్టి ఈ వార్ నేపథ్యం ఉన్న లవ్ స్టోరీలోనూ తనదైన మార్క్ వేయనున్నాడని తెలుస్తోంది. అయితే హను సినిమాలు కమర్శియాల్టీకి దూరంగా ఉంటాయనే విమర్శ తొలి నుంచి ఉంది. స్క్రిప్ట్ కమర్శియల్ గా మలచడంతో వెనుకబడే ఉన్నాడు. మరి ఈ సినిమాతో వాటన్నింటి ఓవర్ కమ్ చేసి తనపై ఉన్న విమర్శని చెరిపేసుకునేలా ఉండాలి.
సక్సెస్ అనివార్యమైన సమయం కూడా ఇది. ఇటీవలి కాలంలో వరుసగా ఫెయిల్యూర్స్ తప్ప సక్సెస్ లు ఆయన ఖాతాలో లేవు. కాబట్టి నిరూపించుకోవాల్సిన సమయం మళ్లీ వచ్చింది. గతంలో వార్ నేపథ్యంలో లవ్ స్టోరీలు ఎక్కువగా బాలీవుడ్ లో తెరకెక్కాయి. తెలుగులో ఆకాష్ పూరి హీరోగా `మెహబూబా` వార్ లవ్ స్టోరీ నేపథ్యంలోనే తెరకెక్కింది. కానీ అంత ఇంపెక్ట్ తీసుకురావడంలో టీమ్ విఫలమైంది. కానీ ఆకాష్ కి నటుడిగా మంచి మార్కులు పడ్డాయి.