డిఎస్సీ -1998ని ట‌చ్ చేస్తోన్న శివ నిర్వాణ‌!

Update: 2022-07-13 00:30 GMT
స‌క్సెస్ అయినవాడే గొప్పోడు. ఫెయిలైనోడో పీనుగుతో స‌మానం. ఇది స‌మాజం..చ‌రిత్ర ఎప్పుడో వేసేసిన ఓ ముద్ర‌. ఫెయిల్యూర్స్ గురించి మేథావులు ఎంతో గొప్ప‌గా చెబుతుంటే? స‌మాజం మాత్రం మ‌రో తీరున చెబుతుంది. ఇప్పుడీ మాట‌లు దేనికంటే?  ఓ ఫెయిల్యూర్ క‌మ్  స‌క్సెస్ ఫుల్ ప‌ర్స‌న్ గురించి తెలుసుకుంటే? స‌మాజం తీరునే ప్ర‌శ్నించాలి అని ఎలుగెత్తి చాటేలా చేసాడు ఆ వ్య‌క్తి.

అత‌నే శ్రీకాకుళం జిల్లా పాత ప‌ట్నంకి చెందిన కేద‌రీశ్వరావు. ఇటీవ‌ల నెట్టింట జోరుగా వైర‌ల్ అయిన పేరు ఇది. 1998 డిఎస్సీ  అభ్య‌ర్ధ‌ల‌కు  2022 లో ఇటీవ‌లే  జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉద్యోగాలు ఇవ్వ‌డంతోనే కేద‌రీశ్వ‌రావు వెలుగులోకి వ‌చ్చారు. మొత్తం 4000 మంది ఉద్యో గాలు పొందినా?  కేద‌రీశ్వ‌ర‌రావు మాత్రం ఎంతో ప్ర‌త్యేకం. టీచ‌ర్ ఉద్యోగ‌మే ప‌ర‌మాశ‌దిగా భావించిన కేదరీశ్వ‌రావు అదే ఉద్యోగం కోసం జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు.

తోటి వారంతా వివిధ వృత్తుల్లో ఉన్న‌త స్థానంలో స్థిర‌ప‌డిన‌క‌ప్పటీకి కేద‌రీశ్వ‌రావు  మాత్రం జీవితాన్నే కోల్పోయారు. ఉన్న‌త చ‌దువు ఎమ్మెసీ బీఈడీ చేతిలో ఉన్నా ప్ర‌యివేటు ఉద్యోగంలో స్థిర‌ప‌డ‌లేదు. ఇటు ప్ర‌యివేటు జాబ్  రాక‌..మ‌రోవైపు అనుక‌నున్న ల‌క్ష్యాన్ని చేరుకోలేక తీవ్ర నిరుత్సాహంలో మాన‌సింక సంఘ‌ర్ణ‌కి గురై స్వ‌గ్రామిన‌కే జీవితాన్ని ప‌రిమితం చేసారు.

చివ‌రికి ఓ బికారీలో మారిపోయాడు. ఉన్న‌త కుటుంబంలో పుట్టినా కాల‌క్ర‌మేణా ఆస్తులు క‌రిగిపోయాయి. దీంతో  వార‌స‌త్వంగా వ‌స్తోన్న బ‌ట్టల‌ వ్యాపారానే సైకిల్ పై  కొన‌సాగిస్తూ జీవితాన్ని న‌డిపించాడు. ఉంటే  తిన‌డం..లేక‌పోతే ప‌స్తుతో ప‌డుకోవ‌డం ఇలా 24 ఏళ్ల జీవితం సాగిపోయింది. ఈ క్ర‌మంలోనే ఎన్నో కోల్పోయారు.

త‌ల్లి దూర‌మైంది. ప్రేమించిన ప్రియురాలు మ‌రోక‌రి వ‌స‌మైంది. ఈ రెండు సంఘ‌ట‌న‌లు ఉద్యోగం క‌న్నా ఎక్కువ‌గా బాధించాయి. అయినా గుండెనిబ్బ‌రాన్ని కోల్పోకుండా ఉన్న‌దాంట్లోనే జీవితాన్ని సాగించాడు. మ‌రి ఇప్పుడీ ఘ‌ట‌న మ‌రో బీఈడీ చ‌దివిన ద‌ర్శ‌కుడ్ని క‌దిలిచిందా? అంటే అవున‌నే  వినిపిస్తోంది. 'నిన్ను కోరి'..'మ‌జిలి' సినిమాల‌తో స్టార్ మేక‌ర్ గా మారిన శివ నిర్వాణ ని కేద‌రీశ్వ‌రావు క‌థ‌ క‌దిలిచింది.

కేద‌రీశ్వ‌రావు జీవిత క‌థ‌ని వెండి తెర‌కెక్కిస్తే అద్భుతంగా ఉంటుంద‌ని అత‌ని బ‌యోపిక్ పై  క‌లం క‌దిలిచినిన‌ట్లు స‌మాచారం. ఓ బీఈడీ క‌ష్టాలు మ‌రో బీఈడీకే తెలుస్తాయని భావించిన శివ  - కేద‌రీశ్వ‌ర‌రావు క‌థ‌ని తెర‌కెక్కించి బీఈడీ స్టూడెంట్ గా సార్ధ‌క‌త చాటుకోవాల‌ని సంక‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. శివ ఇప్ప‌టికే ఇదే జోన‌ర్ లో 'నిన్ను కోరి' చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి  తెలిసిందే. వైజాగ్- అమెరికా  నేప‌థ్యంలో సాగిన  ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు కేద‌రీశ్వ‌రావు క‌థ‌లో ఎంతో ఎమోష‌న్ ఉండ‌టంతో శివ అత‌ని జీవితంపై కూడా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News