వీడియో : బ్రహ్మీ వర్షన్ లో 'లైగర్‌' ట్రైలర్‌

Update: 2022-07-28 05:34 GMT
ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాలో మీమ్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో తెల్సిందే. ప్రతి సందర్భం ను.. ప్రతి సినిమా ను కూడా మీమ్స్ చేసి జనాలను మీమర్స్ ఎంటర్‌ టైన్ చేస్తున్నారు. మీమ్స్ లో బ్రహ్మానందం కనిపించని రోజు అంటూ లేదు. మీమ్స్ కు బ్రహ్మానందం తర్వాతే ఎవరైనా అన్నట్లుగా మీమర్స్ బ్రహ్మీ ఫోటోలను మరియు వీడియోలను వినియోగిస్తున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ లైగర్‌ సినిమా ట్రైలర్ ను బ్రహ్మానందం వర్షన్ లో మీమర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ మరియు డైలాగ్స్ ను ఉంచి.. పూర్తిగా బ్రహ్మానందం విజువల్స్‌ ను పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. బ్రహ్మానందం యొక్క వందల కొద్ది విజువల్స్ ను ఈ మీమ్‌ వీడియో కు వినియోగించారు.

మొత్తానికి లైగర్‌ ట్రైలర్‌ బ్రహ్మానందం వర్షన్ సూపర్ హిట్‌ అయ్యి తెగ షేర్‌ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. అన్ని చోట్ల కూడా ఈ ట్రైలర్ కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అంటూ యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లైగర సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. కరోనా ఇతర కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఫైటర్‌ గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించబోతుంది.

విజయ్ దేవరకొండ పాత్రకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుంది. ఈ సినిమా లో మైక్ టైసన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు లైగర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఎదురు చూస్తున్నారు. పూరి తో కలిసి ఈ సినిమా ను కరణ్‌ జోహార్‌ నిర్మించాడు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ను భారీ గా విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News