ఫోకస్‌: లయన్‌ ముందు అదెందుకు?

Update: 2015-04-13 07:30 GMT
మా టైటిల్‌ కాపీ కొట్టేశారంటూ గొడవ పెట్టుకునే ప్రబుద్ధులకు టాలీవుడ్‌లో కొదవేం లేదు. ఎప్పుడో జమానా కాలంలో రిజిష్టర్‌ చేసి, అసలు ఎప్పటికి సినిమా టేకాఫ్‌ అవుతుందో తెలీని కన్ఫ్యూజన్‌లో సదరు టైటిల్‌ అలా ఫిలింఛాంబర్‌ రిజిష్టర్‌లోనే మూలుగుతూ ఉంటుంది. టైటిల్‌ వరకూ ముందు చూపుతో రిజిష్టర్‌ చేయించుకున్నా.. పెట్టుబడి లేనితనంతో సినిమా తీయలేక ఓటమి అంచుల్లో ఉండేవాళ్లెందరో.

కాని ఏదో ఒక సందర్భంలో అదే టైటిల్‌ వేరొకరికి అవసరం పడుతుంది. ఆ ప్రాజెక్టు వెంటనే టేకాఫ్‌ అవుతుంది. అయితే ఇది మా టైటిలే అంటూ నానా రభస మొదలవుతుంది. ఆ కోవలోనే టైటిళ్ల రచ్చ ఇప్పటికే బోలెడంత జరిగింది టాలీవుడ్‌లో. కత్తి, నిప్పు విషయంలోనూ గతంలో రచ్చ జరిగింది. ఇది మా టైటిల్‌. వేరేవాళ్ల ఒత్తిడితో వదులుకోవాల్సొచ్చింది అని గోల చేసినవాళ్లెందరో. ఆ తర్వాత ఆ టైటిళ్ల ముందు ఓ చిన్న ట్విస్టు. అలా కళ్యాణ్‌రామ్‌ కత్తి, రవితేజ నిప్పు పుట్టుకొచ్చాయి. అలా టైటిల్‌ ముందు హీరో పేరు కలిపితే లీగల్‌గా సమస్యేం ఉండదు.

ఈ బాటలోనే ఇప్పుడు ఎన్‌బికె లయన్‌ చేరింది. లయన్‌ అనే టైటిల్‌ వేరెవరో రిజిష్టర్‌ చేయించుకున్నది. అయితే బాలయ్య లైన్‌లోకి వచ్చి లయన్‌ని లైన్‌లో పెట్టేశారు. దీంతో సదరు హక్కుదారు గొడవ చేశారు. అయితే ఫిలింఛాంబర్‌ సపోర్ట్‌ బాలయ్యకే. మారిన రూల్స్‌ ప్రకారం ఏదైనా టైటిల్‌ రిజిష్టర్‌ చేస్తే నెల రోజుల్లోనే సెట్స్‌కెళ్లాల్సిందే. పైగా 10నిమిషాల ఫుటేజ్‌ చూపించాలి. లేకపోతే ఆ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ చెల్లదు. అయితే అదే టైటిల్‌పై వేరొకరు సినిమా తీయాలంటే సదరు హక్కుదారుని అవతలివాళ్లు సంప్రదించాలి. అయితే బాలయ్య అండ్‌ టీమ్‌ ఓ చిన్న ట్రిక్కు వాడి సెటిల్‌ చేసేశారు. లయన్‌ ముందు ఎన్‌బికె అని తగిలించి ట్విస్టు పెట్టారన్నమాట.

మొన్నటి ఆడియో వేదికపైనా ప్రతి ఒక్కరూ ఎన్‌బికె లయన్‌ అంటూ హడావుడి చేసింది ఏ వివాదం రాకుండానే. అదీ సంగతి.

Tags:    

Similar News