అల‌ల‌పై తేలుతూ మ‌మ్మీ లీసా హెడెన్ స‌ర్ఫింగ్ చూశారా?

Update: 2020-10-14 01:30 GMT
హాట్ మ‌మ్మీ లిసా హేడెన్ సర్ఫింగ్ దుమారం చూశారా? అల‌ల‌పై తేలియాడుతూ చెడుగుడు ఆడేస్తోంది. అస‌లు బులుగు స‌ముద్రంలో భ‌యం అన్న‌దే లేకుండా నిమిషాలు గంట‌లు అలా స‌ర్ఫింగ్ ని ఎంజాయ్ చేస్తున్న తీరు గుబులు రేకెత్తిస్తోంది. అస‌లు చూస్తుంటేనే ఝ‌డుసుకుంటారు. స‌ర్ఫింగ్ నేప‌థ్యంలో హాలీవుడ్ లో ఎన్నో సినిమాలొచ్చాయి. ఉవ్వెత్తున ఎగ‌సిప‌డే కెర‌టాల‌తో పోటీప‌డుతూ స‌ముద్రంలో ప్ర‌మాద‌క‌ర వాతావ‌రణంలో స‌ర్ఫింగ్ చేసే సాహ‌సాల్ని పెద్ద తెర‌పై అద్భుతంగా చూపించారు హాలీవుడ్ ద‌ర్శ‌కులు. వాటిని మించి లీసా చెల‌రేగుతోంది.

ఒక‌వేళ స‌ర్ఫింగ్ నేప‌థ్యంలో బాలీవుడ్ లో సినిమా తీస్తే లీసా హెడెన్ నే లీడ్ చేయాలేమో. హాట్ బాడీతో లీసా స‌ర్ఫింగ్ హీటెక్కిస్తోంది. స‌ర్ఫింగ్ ని తాను ఎంత ఇష్ట‌ప‌డుతుందో ఇటీవలి ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ లో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. షేర్ చేసిన వీడియోలో ఆమె సర్ఫింగ్ సెల‌బ్రేష‌న్ ని చూడవచ్చు. తాను సర్ఫింగ్ ను అమితంగా ఇష్టపడుతుంది.

ప్రస్తుతం భర్త డినో లాల్వాని.. ఇద్దరు కుమారులు జాక్ - లియోలతో కలిసి హాంకాంగ్ లో నివసిస్తున్న క్వీన్ ఫేమ్ లిసా హెడెన్... వేసవి కాలం ముందే ఆమె చేయగలిగినంత సర్ఫింగ్ చేయాలనుకుంటున్నారు. లిసా హేడాన్ ఇటీవల తాను సర్ఫింగ్ చేస్తున్న ఫోటో లు రెండు వీడియోలను పంచుకున్నారు. ఆమె ఇటీవలి ఇన్ స్టాగ్రామ్ ప‌రిశీలిస్తే సర్ఫింగ్ కోస‌మే ఆమె ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ ఫోటోలు వీడియోలే అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. ప్రకృతిలో ఇటువంటి అద్భుతమైన ఉదయం ఈ సృష్టి. సృష్టికర్త ఎంత మేధావి అని నేను ఆలోచిస్తున్నాను.. అంటూ వ్యాఖ్య‌ను ఇన్ స్టాలో జోడించింది.

లిసా హేడాన్ 2016 లో పారిశ్రామికవేత్త డినో లాల్వానీని వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి బిడ్డ జాక్ ‌ను 2017 సంవత్సరంలో .. రెండో బిడ్డ‌ లియోను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో స్వాగతించారు. కొన్ని వారాల క్రితం లీసా బంగారు రంగు స్విమ్ సూట్ లో సర్ఫింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. దీనికి ముందు సర్ఫింగ్ చేస్తున్నప్పుడు కింద పడే క్లిప్ ను కూడా పంచుకుంది. ఇవ‌న్నీ వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News