రామూ ఒక జీనియస్‌ అంటోందిగా..

Update: 2016-04-14 15:30 GMT
అప్పుడెప్పుడో మహేష్‌ బాబు సరసన ''టక్కరి దొంగ'' సినిమాలో మెరిసింది లీసా రే. అయితే ఈ అమ్మడు తరువాత పెద్దగా ఏమీ చేసిందే లేదు. కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో మెరిసినా.. అవి క్లిక్కవ్వలేదు. కాకపోతే తరువాత మోడల్‌ గా అమ్మడు దేశ విదేశాల్లో అద్భుతాలు చేసింది. ఈ ఎన్నారై అమ్మడు తరువాత క్యాన్సర్‌ తో బాధపడి.. దానిని జయించి.. ఇప్పుడు మరోసారి సినిమాల్లో లక్‌ టెస్టు చేసుకుంటోంది.

ఇక ఓంప్రదమే ఈవిడ రామ్‌ గోపాల్‌ వర్మతో చేస్తోంది మరి. కాని చేసేది పెద్ద గ్లామరస్‌ రోల్‌ ఏమీ కాదు. మనోడు కన్నడలో తీసిన కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమా ఉంది చూడండి.. ఆ సినిమాను హిందీలో మళ్లీ తీస్తున్నాడు. తాను చేసిన తప్పులను సరి చేసి.. కొంతమంది క్యాస్టింగ్‌ ను మార్చేసి.. మనోడు హిందీలో చెక్కుతున్నాడులే. సినిమాలో పోలీస్ ఇన్ఫార్మర్‌ ప్రియ అనే పాత్ర ఉంది చూడండి.. ఆ పాత్రలో జీవిస్తోందట లీసా రే.

అందుకే ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా.. డైరక్టర్‌ గురించి కూడా పొగిడేస్తోంది. ''రామూ ఒక జీనియస్. తను రంగీళా - సత్య - కంపెనీ వంటి అద్భుతమైన సినిమాలను తీశాడు. ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది'' అంటూ సెలవిచ్చిందీ బంగారం. సర్లేండి.. అలాగే కానిద్దాం.
Tags:    

Similar News