కాజ‌ల్ వెబ్‌సిరీస్‌.. బ్యాగ్రౌండ్ వాయించేసిన క‌మెడియ‌న్‌!

Update: 2021-02-11 10:01 GMT
సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ఒకే రంగంలో నిష్ణాతులై ఉంటారు. కానీ.. మ‌రికొంద‌రు ఉంటారు. వారు మ‌ల్టీ టాలెంటెడ్‌. తెర‌పై స‌త్తా చాట‌గ‌ల‌రు.. మెగాఫోన్ ప‌ట్టుకోగ‌ల‌రు.. నిర్మాత‌గా మారిపోతారు.. టెక్నీషియ‌న్ అవ‌తారం ఎత్తుతారు. తాజాగా.. ఇలాంటి ఫీట్ సాధించారు త‌మిళ్ క‌మెడియ‌న్‌. త‌న టాలెంట్ ను చూపించిన హాస్య‌న‌టుడు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రోల్ ప్లే చేశాడు.

వివాహం త‌ర్వాత సినిమాల‌కు టాటా చెప్తుందేమో అనుకున్న వారి అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. వేగంగా సినిమాలు చేస్తోంది కాజ‌ల్. అయితే.. వెండి తెర‌మీద‌నే కాకుండా.. వెబ్ సిరీస్ ల‌లోనూ స‌త్తా చాటేందు‌కు సిద్ధ‌మైంది చంద‌మామ‌. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ‘లైవ్ టెలికాస్ట్’ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది.

కాజల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఈ ‘లైవ్ టెలికాస్ట్’ సిరీస్ కి వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆయ‌న త‌మ్ముడు ప్రేమ్ జీ కోలీవుడ్ లో క‌మెడియ‌న్ గా కంటిన్యూ అవుతున్నాడు. అంద‌రికీ సుప‌రిచితుడు అయిన ప్రేమ్ జీ.. ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మారి త‌న టాలెంట్ చూపించాడు.

కాగా.. ‘లైవ్ టెలికాస్ట్’ వెబ్ సిరీస్ ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్‌. ఇందులో పాటలకు స్కోప్ లేదు. ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్కే ప్రాణం. ఆ బాధ్య‌త తీసుకున్న ప్రేమ్ జీ.. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడ‌ని టాక్‌. మ‌రి, ఈ క‌మెడియ‌న్ ఎంత సీరియ‌స్ గా బ్యాగ్రౌండ్ వాయించాడు? అన్న‌ది తెలియాలంటే ఈ చిత్రం రిలీజ్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News