ట్రెండీ సినతల్లి కన్నీటి ముచ్చట్లు

Update: 2021-11-06 07:32 GMT
గత కొన్ని రోజులుగా తెలుగు మరియు తమిళ జనాలు సోషల్‌ మీడియాలో సినతల్లి గురించి మాట్లాడుకుంటున్నారు. తమిళంలో సెంగెని.. తెలుగులో సినతల్లి అంటూ ఆమె గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఆస్కార్‌ కాకున్నా కనీసం జాతీయ అవార్డు అయినా ఆమెకు ఇవ్వాల్సిందే అంటూ చిన్న పాటి సోషల్‌ మీడియా ఉద్యమం జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆమె ఎవరో అర్థం అయ్యింది అనుకుంటా... ఆమె జై భీమ్ సినిమాలో నటించిన లిజోమోల్ జోస్. మలయాళంకు చెందిన ఈ అమ్మాయి జై భీమ్ సినిమాలో కనిపించిన తీరు మరియు నటించిన తీరుకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తప్పులేదు అంటూ సినీ అభిమానులు అంటున్నారు. రెండు మూడు రోజులుగా తెగ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న సినతల్లి అలియాస్‌ లిజోమోల్ జోస్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జై భీమ్ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనల గురించి వివరించింది.

అమెజాన్ ప్రైమ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతున్న జై భీమ్ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. 1990 కాలంలో గిరిజనుల పై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వాటిని ఒప్పుకునే వరకు కొట్టేవారు. కొందరు దెబ్బలతో మృతి చెందారు. అలా మృతి చెందిన ఒక వ్యక్తి లాయర్ చంద్రుతో కలిసి చేసిన నిజ పోరాటంను సూర్య జై భీమ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సూర్య సొంత బ్యానర్‌ లో ఈ సినిమాను టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నిర్మించాడు. సూర్య ఇలాంటి పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అనుకుంటే తానే స్వయంగా నిర్మించడం కూడా సినిమా పట్ల ఆయనకు ఉన్న నమ్మకం ను తెలియజేసింది. జై భీమ్ వంటి మెసేజ్ ఓరియంటెడ్‌ రా ఫిల్మ్స్ ను ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా కమర్షియల్‌ హీరోలకు రిస్క్‌ తో కూడుకున్నది. అయినా కూడా సూర్య నటించేందుకు ఓకే చెప్పాడు. ఇక సినతల్లి పాత్ర డీ గ్లామర్‌ గా.. నిండు గర్బంతో కనిపించకుండా పోయిన భర్త కోసం పోరాడే పాత్ర. ఆ పాత్ర సాదారణ నటి ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా రక్తికట్టించలేక పోయారు.

ఎంతో మందిని పరిశీలించిన తర్వాత లిజోమోల్ జోస్ చివరకు ఎంపిక అయ్యింది. సూర్య వంటి స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్ గా అయితే నేను నటిస్తాను.. ఇలాంటి పాత్రను నేను ఎందుకు చేస్తాను అని లిజోమోల్ జోస్ అనకుండా సినతల్లి పాత్రకు ఓకే చెప్పి అప్పుడే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక షూటింగ్‌ సమయంలో ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండాల్సి వచ్చిందట. ఒక సారి పోలీస్‌ స్టేషన్‌ లో భర్తను కొడుతున్న సమయంలో కన్నీరు పెట్టుకుంటూ నటించాల్సిన సన్నివేశం ఉందట. ఆ సన్నివేశంలో లిజోమోల్ జోస్ కనీసం గ్లిజరిన్ కూడా పెట్టుకోకుండా ఏడ్చేసిందట. దర్శకుడు కట్‌ చెప్పిన తర్వాత కూడా కన్నీళ్లు ఆగలేదని లిజోమోల్ జోస్ చెప్పింది. దర్శకుడు సన్నివేశం వివరించిన సమయంలోనే మనసు ద్రవించి పోయింది. ఆ సమయంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణ గుర్తుకు వచ్చి కన్నీరు ఆగలేదు అంది. షూటింగ్ లో కన్నీరు పెట్టుకోవాలంటే గ్లిజరిన్‌ తప్పనిసరి. అలాంటిది ఏమీ లేకుండా కన్నీరు పెట్టుకుంది అంటే ఖచ్చితంగా లిజోమోల్ జోస్ నటి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News