లోకేష్ మల్టివర్స్.. విజయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Update: 2023-01-16 23:30 GMT
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వారసుడు మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో లోకేష్ కనగరాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ మూవీ సపరేట్ స్టొరీ అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా మాత్రం లోకేష్ యూనివర్స్ చిత్రాలలో భాగంగా తయారవుతుంది.

ఖైది, విక్రమ్, రోలెక్స్ పాత్రల తరహలోనే ఒక స్పెషల్ క్యారెక్టర్ ని సృష్టించి దాని చుట్టూ కథని సిద్ధం చేసి ఇప్పటి వరకు తాను తెరకెక్కించిన ఖైది, విక్రమ్ సినిమాలతో లింక్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతుంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష, కీర్తి సురేష్ కథానాయకులుగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా కనిపిస్తున్నాడు.

అలాగే అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అయితే వారి పాత్రలు ఎలా ఉంటాయనేదానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో విజయ్ పవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎలా ఉండబోతుంది. విక్రమ్ లో కమల్ హసన్ పాత్రతో ఎలాంటి కనెక్షన్ ఉంటుంది. అలాగే ఖైది స్టొరీలైన్ కి దీనికి లింక్ ఏంటి అనే విషయాలని విజయ్ సినిమాలో లోకేష్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యుల్ ని పూర్తిచేసుకుంది. త్వరలో నెక్స్ట్ షెడ్యుల్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అప్పుడే కన్ఫర్మ్ చేసేసారు. అక్టోబర్ 19న ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీని రిలీజ్ చేయడానికి లోకేష్ టీమ్ ప్లాన్ చేస్తుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుటున్న ఈ సినిమా దళపతి ఫ్యాన్స్ తో పాటు లోకేష్ యూనివర్స్ కథలు ఇష్టపడే వారికి ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News