లాంగ్ లీవ్ తెలుగు సినిమా

Update: 2022-02-14 11:30 GMT
వ‌ర‌ల్డ్ వైడ్ గా వున్న సినీ ప్రియుల‌తో పోలిస్తే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు చాలా భిన్నంగా వుంటారు.. భిన్నంగా ఆలోచిస్తారు. సినిమా అంటూ ఎలాంటి రిస్క్ అయినా బేర్ చేయ‌డానికి ముందుంటారు. ప్ర‌పంచం మొత్తం క‌రోనా ధాటికి కుదేల‌వుతున్న వేళ సినీ ఇండ‌స్ట్రీ కూడా కుదైలైపోవాల్సిందేనా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఫ‌స్ట్ వేవ్ త‌రువాత మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్న వేళ థియేట‌ర్ల‌కు 50 యాశం ఆక్యుపెన్సీని మాత్ర‌మే విధిస్తూ కేంద్రం ఉత్త‌ర్వ్యులు జారీ చేసిన వేళ సినిమాకు అండ‌గా నిలిచింది తెలుగు ప్రేక్ష‌కులే.

బాలీవుడ్ మేక‌ర్స్ భారీ చిత్రాల రిలీజ్ కోసం ఓటీటీల బాట‌ప‌డుతుంటే తెలుగు ప్రేక్ష‌కులిచ్చిన ధైర్యంతో మ‌న సినిమాలు థియేట‌ర్ల‌ల‌లో సంద‌డి చేశాయి. భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. ఇది యావ‌త్ భార‌తీయ సినీ దిగ్గ‌జాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. కోవిడ్ భ‌యంతో ఉత్త‌రాదిలో థియేట‌ర్లు తెర‌వ‌ని ప‌రిస్థితి వుంటే ద‌క్షిణాదిలో మ‌రీ ప్ర‌ధానంగా టాలీవుడ్ లో థియేట‌ర్లు రీఓపెన్ కు నోచుకోవ‌డం.. సినిమాలు రిలీజ్ చేస్తే ప్రేక్ష‌కులు థియేల‌ర్ల‌కు వ‌స్తారా? అని భ‌యంతో టాలీవుడ్ మేక‌ర్స్ ఎదురుచూస్తున్న వేళ మీకు అండ‌గా మేమున్నామంటూ థియేట‌ర్ల‌లో సంద‌డి చేశారు.

క‌రోనా భ‌యాలు వెంటాడుతున్నా ఆ భ‌యాల‌ని లెక్క‌యేయ‌క కంటెంట్ బాగుందంటే చాలు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు చెందిన తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేస్తున్నారు. దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ లాంటి విష‌మ ప‌రిస్థితుల్లోనూ మ‌న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డులు సృష్టించాయి. థ‌ర్డ్ వేవ్ ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌వుతున్న స‌మ‌యంలోనూ భారీ చిత్రాలని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నిర్మాత‌లు జంకుతున్న వేళ `అఖండ‌`కు ట్రెమండ‌ప్ రెస్సాన్స్ ని అందించి ఆ భ‌యాల‌ని పోగొట్టారు. ఆ త‌రువాత వ‌చ్చిన `పుష్ప‌`ని పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌బెట్టారు.  

కంటెంట్ కొంచెం బాగుంద‌ని తెలిసినా ఆయా సినిమాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేస్తూ భారీ విజ‌యాల్ని అందిస్తున్నారు. క‌రోనా భ‌యం వ‌ణికిస్తున్నా అవేవి ప‌ట్టించుకోకుండా థియేట‌ర్ల‌కు వ‌చ్చేస్తున్నారు. టాలీవుడ్ కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ నిర్మాత‌లు ఓ విష‌యాన్ని గ‌మ‌నించాలి. కోవిడ్ కి వెర‌వ‌కుండా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తూ తెలుగు సినిమాకు స‌పోర్ట్ గా నిలుస్తున్న ఆడియ‌న్స్ కు మంచి కంటెంట్ ని ఖ‌చ్చితంగా అందించాల‌ని భావించాలి.  

రీసెంట్ గా విడుద‌లైన `డీజే టిల్లు` ఒక్క రోజులోనే 3 కోట్లు వ‌సూలు చేసింది. దీని ముందు విడుద‌లైన చిత్రాలు ఆశించిన స్థాయిలో లేవు. కానీ కొత్త హీరో సినిమా అయినా కంటెంట్ బాగుండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కులు ఈ మూవీకి అండ‌గా నిలిచి బ్ర‌హ్మ ర‌థంప‌డుతున్నారు. అంటే మ‌న వాళ్లు కంటెంట్ విష‌యంలో ఎంత క్లియ‌ర్‌గా వున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

విప‌త్క‌ర స‌మ‌యాల్లోనూ తెలుగు సినిమాకు అండ‌గా నిలుస్తూ వ‌ర‌ల్డ్ సినిమాని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న మ‌న స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కుల‌ని దృష్టిలో పెట్టుకుని వారికి న‌చ్చే.. వారు మెచ్చే మ‌రిన్ని చిత్రాల‌ని మ‌న మేక‌ర్స్ అందిస్తార‌ని, ఆవిష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ని క‌న‌బ‌రుస్తార‌ని ఆశిద్దాం.
Tags:    

Similar News