వైరల్ అవుతున్న హీరోయిన్ వీడియో..

Update: 2020-03-19 11:30 GMT
కరోనా వ్యాప్తి వలన సెలెబ్రిటీలు వాళ్లని వాళ్లే ఇళ్లలో నిర్బందించుకోవడం చూస్తున్నాం. తాజాగా కరోనా ప్రభావం తో లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసింది సోనమ్ కపూర్. భర్త ఆనంద్ అహుజా తో కలిసి అత్తమామల తో సొంతింటికి చేరుకుంది. కరోనా బారిన పడకుండా తనను తాను నిర్బంధం చేసుకున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా 14రోజుల పాటు తాను ఇంటికే పరిమితం కానుందట. అయితే లండన్ నుండి వచ్చిన వెంటనే సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ అభిమానుల తో పంచుకుంది.

అయితే సోనమ్ గురించి ఒక వీడియోను తన భర్త ఆనంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియోలో సోనమ్ కపూర్ అద్దం దగ్గర నిలబడి బయట ఎవరితో నో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కానీ సోనమ్ మాట్లాడుతుంది తన అత్త ప్రియా అహుజాతోనే అని భర్త ఆనంద్ తెలిపాడు. సోనమ్ ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అత్తతో సంభాషిస్తుంది. సోనమ్ ప్రస్తుతం నిర్బంధంలో ఉంది అని తెలియజేయడానికి ఈ వీడియో పోస్టు చేసినట్లు ఆనంద్ ట్యాగ్ లైన్ మెన్షన్ చేసాడు.

ఇప్పుడీ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేగాక సోనమ్ మాట్లాడుతూ కరోనా వలన చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళనలు నెలకొన్నాయని, అందువల్లనే విడుదలకు సిద్ధమైన సూర్యవంశీ, సందీప్ ఔర్ పింకీ ఫెరర్ సినిమాల తో పాటు ఇతర సినిమాలన్నీ మార్చి 31వరకు వాయిదా పడినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News